News


మార్కెట్లకు బ్యాంక్స్‌, ఫార్మా దన్ను

Thursday 6th February 2020
Markets_main1580985075.png-31570

నాలుగో రోజూ మార్కెట్లు ప్లస్‌
సెన్సెక్స్‌ 163 పాయింట్లు అప్‌
49 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 

ప్రపం‍చ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ సానుకూలంగా కదిలాయి. వెరసి వరుసగా నాలుగో రోజు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 163 పాయింట్లు పెరిగి 41,306 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 49 పాయింట్లు పుంజుకుని 12,138 వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో మార్కెట్లు కొంతమేర ఒడిదొడుకులను చవిచూశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 41,405 వద్ద గరిష్టాన్నీ, 41,113 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక నిఫ్టీ 12,161-12,085 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను నమోదు చేసుకుంది. గత మూడు రోజుల్లోనే సెన్సెక్స్‌ 1400 పాయింట్లకుపైగా జంప్‌చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ఊగిసలాటకు లోనైనట్లు తెలియజేశారు. బుధవారం అమెరికా ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సరికొత్త రికార్డులను అందుకోగా.. చమురు ధరలు రెండు రోజుల్లో 5 శాతం జంప్‌చేయడం విశేషం! కరోనా వైరస్‌కు వాక్సిన్‌ వెలువడనుందన్న అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఎఫ్‌ఎంసీజీ డీలా
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2.7 శాతం జంప్‌చేయగా.. ఫార్మా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మీడియా, మెటల్‌ 1.6-0.7 శాతం మధ్య బలపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియల్టీ 0.5-0.3 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, ఇండస్‌ఇండ్‌, జీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎయిర్‌టెల్‌, గెయిల్‌, యస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటో 5.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే టాటా మోటార్స్‌, సిప్లా, టైటన్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, బీపీసీఎల్‌, హిందాల్కో, కొటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌ 3-0.7 శాతం మధ్య నష్టపోయాయి.

ఐబీ హౌసింగ్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌ 15 శాతం దూసుకెళ్లగా.. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, పిరమల్‌, ఆయిల్‌ ఇండియా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 8.3-4.5 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు జూబిలెంట్‌ ఫుడ్‌, టొరంట్‌ పవర్‌, డీఎల్‌ఎఫ్‌, ఇండిగో, పేజ్‌ ఇండస్ట్రీస్‌, బెర్జర్‌ పెయింట్స్‌, అదానీ పవర్‌, అపోలో టైర్‌ 4-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1387 లాభపడగా.. 1092 నష్టాలతో నిలిచాయి.

పెట్టుబడుల బాట..
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 249 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 263 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 366 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 602 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.   You may be interested

పెట్రోల్‌తో నడిచే విటార బ్రెజ్జా

Thursday 6th February 2020

ఆటోఎక్స్‌పో-2020లో విడుదల చేసిన మారుతీ సుజుకీ గ్రేటర్‌ నోయిడా: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విటార బ్రెజ్జాను గురువారం ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది. ఈ కాంపాక్ట్‌ మోడల్‌లో బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌ ఉండడం విశేషం. కొత్త విటార బ్రెజ్జాలో 1.5 లీటర్ల సామర్ధ్యం గల పెట్రోల్‌  ఇంజిన్‌తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ పెట్రోల్‌ ఇంజిన్‌ అతితక్కువ ఉద్గారాలను వెలువరిస్తుందని కంపెనీ

ఫార్మా షేర్లలో బుల్‌ ట్రెండ్‌ షురూ?!

Thursday 6th February 2020

6-12 నెలల్లో ఫార్మా స్టాక్స్‌లో ర్యాలీ 30 శాతం రిటర్నులకు చాన్స్‌? గోల్డిలాక్స్‌ ప్రీమియమ్‌ రీసెర్చ్‌ అంచనా గతేడాది(2019) మార్కెట్లలో దూకుడు చూపిన స్టాక్స్‌ ఈ ఏడాది(2020)లో వెనకసీట్లో కూర్చుంటాయని గోల్డిలాక్స్‌ ప్రీమియమ్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకులు గౌతమ్‌ షా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు దూకుడు చూపే వీలున్నట్లు చెబుతున్నారు. ఫార్మా రంగంలో బుల్‌ ట్రెండ్‌ ఇప్పుడే ప్రారంభమైనట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్కెట్లతోపాటు.. మెటల్స్‌, ఆటో, రియల్టీ తదితర

Most from this category