News


ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Friday 20th December 2019
Markets_main1576823436.png-30335

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 2,526.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా ఏకకాలంలో రూ.10000 కోట్ల విలువ కలిగిన 10ఏళ్ల బాండ్లను కొనుగోలు చేయడంతో పాటు విక్రయిస్తున్నట్లు ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. 2029లో పరిపక్వమయ్యే రూ.10,000 కోట్లకు సమానమైన 6.45శాతం ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడంతో పాటు 2020 లో పరిపక్వమయ్యే రూ .10,000 కోట్ల స్వల్పకాలిక బాండ్లను విక్రయిస్తామని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ ప్రకటించిన ఈ ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్‌ ప్రక్రియ ప్రకటనతో బాండ్‌ ఈల్డ్‌ దిగివచ్చింది. నేడు 10ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ కిత్రం ముగింపు(6.746శాతం)తో పోలిస్తే 6.623శాతం వద్ద ట్రేడ్‌ అవుతోంది. దశాబ్దం ప్రారంభంలో అమెరికాలో నిర్వహించిన 'ఆపరేషన్ ట్విస్ట్' మాదిరిగానే ఆర్‌బీఐ ఈ రకమైన ప్రత్యేక బహిరంగ మార్కెట్ ఆపరేషన్ నిర్వహించడం ఇదే మొదటిసారి.  భవిష్యత్తులో ధీర్ఘకాలిక ఈల్డ్‌ దిగివస్తుందని ఆశావహన అంచనాలు బ్యాంకింగ్‌ షేర్లకు డిమాండ్‌ను పెంచాయి.  ఫలితంగా నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల లభించడంతో ఒక దశలో ఇండెక్స్‌ 2.50శాతం పెరిగి 2,574.05 స్థాయిని తాకింది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ కిత్రం ముగింపు (2,513.70)తో పోలిస్తే 2శాతం లాభంతో 2,569 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో యూనియన్‌ బ్యాంక్, సిండికేట్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం పెరిగాయి. ఇండియన్‌ బ్యాంక్‌ 3శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 2.50శాతం, సిండికేట్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 2శాతం లాభపడ్డాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేరు 1శాతం పెరిగింది. జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. ఇక ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ 35 పాయింట్ల పెరిగి 12293 వద్ద, సెన్సెక్స్‌ 136 పాయింట్ల లాభంతో 41,810 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. 



You may be interested

2020 టాప్‌ రికమండేషన్లు

Friday 20th December 2019

కొత్త ఏడాది కోసం ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు పలు రంగాలు, షేర్లను రికమండ్‌ చేస్తున్నాయి. 1. క్రెడిట్‌ సూసీ: ఫైనాన్షియల్స్‌లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌. టెల్కోల్లో ఎయిర్‌టెల్‌, యుటిలిటీల్లో పవర్‌గ్రిడ్‌, మెటల్స్‌లో టాటా మెటల్స్‌పై బుల్లిష్‌. ఫార్మా, ఐటీ రంగాలపై స్వల్ప పాజిటివ్‌. 2. బీఎన్‌పీ పారిబా: ప్రైవేట్‌ బ్యాంక్స్‌, బీమా కంపెనీలు, టాప్‌ ఐటీ కంపెనీలను పరిశీలించవచ్చు. వాల్యూషన్లు తక్కువగా ఉండి రీబౌన్స్‌ చూసే స్టాకులను ఎంచుకోవచ్చు. 3. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌:

కొత్త ఏడాది ఈక్విటీ రిటర్న్స్‌ అంతంతమాత్రమే!

Friday 20th December 2019

బ్రోకరేజ్‌ల అంచనాలు వచ్చే సంవత్సరం దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒక మోస్తరు రాబడులే అందిస్తాయని ప్రముఖ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. వాల్యూషన్లు పెరిగిపోవడం, ఆర్థిక మందగమనం కొనసాగడం, ప్రభుత్వం నుంచి విత్త సాయానికి పరిమిత అవకాశాలుండడం.. మార్కెట్లపై ఒత్తిడి పెంచుతాయని అభిప్రాయపడ్డాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌లపై వివిధ బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... 1. బీఎన్‌పీ పారిబా: సెన్సెక్స్‌పై ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌, 2020 టార్గెట్‌ 44,500. జీడీపీ వృద్ది అంచనాల్లో

Most from this category