News


లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు

Tuesday 4th June 2019
Markets_main1559631021.png-26087

నష్టాల మార్కెట్లోనూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేడు 2 శాతానికి పైగా పెరిగింది. మందగించిన దేశీయ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు ఆర్‌బీఐ ఈ సమీక్షా సమావేశాల్లో కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు మొగ్గుచూపుందనే అంచనాలు ఊపందుకున్నాయి. అలాగే మొండిబకాయిలతో సతమతవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదుకునేందుకు కేంద్రం రూ.40వేల కోట్ల మూలధన సహాయాన్ని సమకూర్చే యోచనలో ఉంది. ఈ సానుకూలాంశాలతో నేడు ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు నేడు డిమాండ్‌ పెరిగింది. ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ షేర్లు 5శాతం ర్యాలీ చేయగా, యూనియన్‌ బ్యాంక్‌ 4శాతం, సిండికేట్‌ బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌ 3శాతం పెరిగాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 2శాతం పెరిగాయి. కెనరా బ్యాంక్‌, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. మరోవైపు ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు 5శాతం నష్టపోగా, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం వరుకు క్షీణించాయి. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(3,265.55 )తో పోలిస్తే 1శాతం లాభంతో 3,292.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 172పాయింట్ల నష్టపోయి 40,095 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు క్షీణించి 12,031ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌ సిఫార్సులు

Tuesday 4th June 2019

వచ్చే నెల రోజుల సమయంలో దాదాపు 10 శాతం వరకు రాబడిని అందించే మూడు స్టాకులను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండ్‌ చేస్తోంది. 1. గోద్రేజ్‌ కన్జూమర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 750. స్టాప్‌లాస్‌ రూ. 680. కొద్దికాలం క్రితం రూ.630 వద్ద బహుళస్థాయి మద్దతు పొందిన అనంతరం మార్చిలో అప్‌మూవ్‌ చూపింది. ప్రస్తుతం డైలీ చార్టుల్లో హైవాల్యూంలతో కూడిన బ్రేకవుట్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఎంసీజీ రంగం సైతం బాటమవుట్‌ చెంది ర్యాలీకి

నిఫ్టీ టార్గెట్‌ 12430 పాయింట్లు!

Tuesday 4th June 2019

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిఫ్టీ ప్రస్తుత దశలో 12430 పాయింట్ల వరకు ఎగబాకవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి నందిశ్‌ షా అంచనా వేశారు. గతంలో 11760- 10005 పాయింట్ల పతనానికి ఇది 138.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయని, అందువల్ల ఇక్కడ నిఫ్టీ టాప్‌అవుట్‌ కావచ్చని తెలిపారు. నిఫ్టీకి దిగువన 11800 పాయింట్ల వద్ద మద్దతు దొరుకుతుందన్నారు. సోమవారం ఆల్‌టైమ్‌ హైని తాకిన నిఫ్టీ మంగళవారం ట్రేడింగ్‌లో స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. మే 17

Most from this category