News


ఎస్‌బీఐ 2 శాతం డౌన్‌: నష్టాల్లో పీఎస్‌యూ బ్యాంకులు

Monday 23rd December 2019
news_main1577094165.png-30382

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. సూచీల వరుస 4రోజుల రికార్డు ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది. మార్కెట్‌ భారీ పతనంలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. గతవారంలో  దీర్ఘకాలిక ఈల్డ్‌ తగ్గింపు లక్ష్యంగా ఆపరేషన్‌ ట్విస్ట్‌ పేరుతో రూ.10వేల కోట్ల విలువైన పదేళ్ల కాలపరిమితి ఉన్న ప్రభుత్వ బాండ్లను కొంటామని, ఇదే సమయంలో అంతే మొత్తానికి ఏడాది కాలపరిమితి కలిగిన బాండ్స్‌ను విక్రయిస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్‌లో ప్రభుత్వరంగ షేర్లు భారీగా ర్యాలీ చేసి మార్కెట్‌ లాభాల ముగింపు కారణమైన సంగతి తెలిసిందే. అయితే నేటి ట్రేడింగ్‌లో ఆయా బ్యాంకింగ్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయి 2,520.55 వద్ద ఇంట్రాడే గరిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ క్రితం​ముగింపు(2,570.90)తో పోలిస్తే 1.57శాతం నష్టంతో 2,530.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి పీఎస్‌యూ ఇండెక్స్‌లో సిండికేట్‌ బ్యాంక్‌ 3శాతం నష్టపోయింది. ఇండియన్‌ బ్యాంక్‌ 2.50శాతం, యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ 2శాతం క్షీణించాయి. పీఎన్‌బీ, ఎస్‌బీఐ షేర్లు 1.50శాతం నష్టపోయాయి. సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహదాబాద్‌ అరశాతం నష్టపోయాయి. అయితే జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌ షేరు మాత్రం అరశాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది.  



You may be interested

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ కొనొచ్చు!

Monday 23rd December 2019

ఎస్‌బీఐ ఎంఎఫ్‌ సీఐవో నవనీత్‌ మునోత్‌ ఇప్పటికే మధ్య, చిన్నతరహా(మిడ్‌, స్మాల్‌) కౌంటర్లలో చాలా వరకూ దిద్దుబాటు(కరెక‌్షన్‌) జరిగింది. దీంతో ఇకపై ఈ విభాగంపై దృష్టి పెట్టవచ్చంటున్నారు ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో నవనీత్‌ మునోత్‌. దేశీయంగా అతిపెద్ద ఈక్విటీ ఫండ్‌ నిర్వహిస్తున్న నవనీత్‌.. మార్కెట్‌ ట్రెండ్‌పై అవగాహన కోసం ప్రధానంగా నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తానంటున్నారు. స్థూల ఆర్థిక అంశాలు, కార్పొరేట్ల లాభదాయకత, వేల్యుయేషన్స్‌, లిక్విడిటీ పరిస్థితుల ఆధారంగా మార్కెట్ల

కొత్త ఏడాది కోసం కాంట్రాబెట్స్‌

Monday 23rd December 2019

వచ్చే సంవత్సరంలో మంచి రాబడినిచ్చే అవకాశమున్న కాంట్రా స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. ఐటీసీ: ఈ ఏడాది ఐటీసీ దాదాపు 14 శాతం పతనమైంది. సిగిరెట్లపై అధిక సెస్సు భయాలు షేరును కుంగదీశాయి. అయితే అలాంటి ప్రతిపాదనలేమీ రానందున ఇకపై షేరు పుంజుకుంటుందని మోతీలాల్‌ఓస్వాల్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తున్నాయి. వాల్యూం గ్రోత్‌ క్రమంగా పెరుగుతోందని తెలిపాయి. ప్రస్తుత వాల్యూషన్ల వద్ద చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు వివరించాయి. షేరు

Most from this category