News


నష్టాల్లో ప్రతిపాదిత విలీన బ్యాంకింగ్‌ షేర్లు

Tuesday 3rd September 2019
Markets_main1567492237.png-28161

బ్యాంకింగ్‌ వ్యవస్థను చక్కదిద్దే ప్రక్రియలో భాగంగా కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనానికి తెరతీసింది. మొత్తం 10బ్యాంకుల విలీనం చేసి 4బ్యాంకులకు పరిమితం చేయాలని నిర్ణయించింది. తాజా విలీనంతో పీఎస్‌బీల సంఖ్య 12కు పరిమితం కానుంది. విలీనం అవుతున్న బ్యాంకుల్లో కొన్నింటికి తగినంత మూలధనం లేకపోవడం, విలీనం అనంతరం మొండిబకాయిలు మరింత పెరగవచ్చనే భయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రేడింగ్‌లో పీఎన్‌బీ రంగ షేర్లు భారీగా క్షీణించాయి. విలీనం చేసుకునే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు 7శాతం నుంచి 8శాతం క్షీణించాయి. విలీనం కాబడే ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌ షేర్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. 
విలీనం:- 1
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు విలీనం కానున్నాయి. ఫలితంగా పీఎన్‌బీ దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. విలీనం నేపథ్యంలో నేడు పీఎన్‌బీ షేర్లు 8.50శాతం నష్టపోయింది. విలీనం అవుతున్న ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ షేర్లు 7.50శాతం, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు అరశాతం నష్టపోయాయి. 
విలీనం:- 2
కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌  విలీనం అవుతుంది. తద్వారా కెనరా బ్యాంక్‌ 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అవుతోంది. విలీన ప్రక్రియ నేపథ్యంలో నేడు కెనరా బ్యాంక్‌ షేర్లు 8.50శాతం నష్టపోయాయి. విలీన బ్యాంక్‌ సిండికేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు అరశాతం వరకు పతనమయ్యాయి. 
విలీనం:-3 
యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌లు విలీనం కానున్నాయి. తద్వారా యూనియన్‌ బ్యాంక్‌ 5వ పెద్ద అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనుంది. నేడు యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 7శాతం క్షీణించాయి. విలీనమయ్యే ఆంధ్రా బ్యాంక్‌ షేర్లు 5శాతం లాభపడగా, కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 18.30శాతం పెరిగాయి. 
విలీనం:- 4 
ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం కానుంది. ఫలితంగా ఇండియన్‌ బ్యాంక్‌ దేశంలో అతిపెద్ద 7వ బ్యాంక్‌గా అవతరించనుంది. 
ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు 7.50శాతం క్షీణించాయి.  విలీనం కాబడే ఇండియన్‌ బ్యాంక్‌ 3శాతం పతనయ్యాయి.



You may be interested

ప్రభుత్వ బ్యాంకుల విలీనం.. పైవేట్‌ బ్యాంకులకు మంచిదా?

Tuesday 3rd September 2019

ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన పక్రియ, వీటి ప్రత్యర్థి బ్యాంకులకు లాభాన్ని చేకూరుస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు అన్నారు. విలీన పక్రియ వలన విలీన బ్యాంకుల రుణ వృద్ధి తగ్గుతుందని, ఈ బ్యాంకులలో ఉద్యోగులు, బ్రాంచులను కలిపే విలీన పక్రియ వలన స్వల్ప కాలంలో ఏర్పడే అనిశ్చితి వలన ప్రైవేట్‌ బ్యాంకులు లాభపడతాయని తెలిపారు. కాగా శుక్రవారం ఆర్థిక మంత్రి 27 ప్రభుత్వరంగ బ్యాంకులను 12కి తగ్గించనున్నట్టు

ట్రేడ్‌వార్‌ ఎఫెక్ట్‌ : పసిడి మరో 10డాలర్ల ర్యాలీ

Tuesday 3rd September 2019

అగ్రరాజ్యాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం పసిడి ధరకు బాగా కలిసొస్తుంది. ప్రపంచమార్కెట్లోని పసిడి ధర నేటి ఆసియా ట్రేడింగ్‌లో 10డాలర్లు పెరిగింది. ఈ వారంలో పసిడికిది వరుసగా రెండోరోజూ లాభాల ర్యాలీ కావడం విశేషం. అయితే డాలర్‌ ఇండెక్స్‌ రెండేళ్ల గరిష్టాన్ని తాకడం పసిడి ర్యాలీకి కొద్దిమేర అడ్డుకుంటుంది. ఈ సెప్టెంబర్‌ 01 నుంచి చైనా దేశాల నుంచి దిగుమతి అవుతున్న టెలివిజన్లు, షూ లపై 15శాతం అదనపు

Most from this category