News


ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల పతనం

Monday 30th September 2019
Markets_main1569825071.png-28623

నష్టాల మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌  ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 4శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,380.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ పతనం నుంచే ప్రభుత్వరంగ రంగ షేర్లలో భారీ అమ్మకాలు నెలకొనడంతో ఇండెక్స్‌ ఒక దశలో దాదాపు 4శాతం నష్టపోయి 2286.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30నిలకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,376.35)తో పోలిస్తే 3.75శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 6నుంచి 5శాతం నష్టపోయాయి. సిండికేట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 4శాతం, కెనరా బ్యాంక్‌, జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌ 3.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ, ఓరియంటల్‌ బ్యాంక్‌ 3శాతం షేర్లు 3శాతం పతనమయ్యాయి. అలహదాబాద్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం, పీఎన్‌బీ బ్యాంక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. 



You may be interested

భారత్‌ 22 ఈటీఎఫ్‌ నాలుగో ఇష్యూ ఆకర్షణియం!

Monday 30th September 2019

-పీఎస్‌యూ స్టాకుల ర్యాలీతో స్వల్పకాలానికి ఈ ఈటీఎఫ్‌ మంచిదే -కానీ దీర్ఘకాల ఇన్వెస్టర్లు దూరంగా ఉండే అవకాశం: విశ్లేషకులు   ప్రభుత్వ రంగ కంపెనీలు, బ్యాంకులు, కొన్ని ప్రైవేట్‌ కంపెనీల స్టాకులను కలిగి ఉన్న భారత్‌ 22 ఈటీఎఫ్‌(ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) నాలుగో విడత ఇష్యు అక్టోబర్‌ 3 వ తేది నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఇష్యు ద్వారా రూ. 8,000 కోట్లను సమీకరించుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకొస్తుంది. అక్టోబర్‌ 3

ఆర్‌బీఐ పీసీఏ అమలు..లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ లోయర్‌ సర్క్యూట్‌

Monday 30th September 2019

  లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌(ఎల్‌వీబీ)పై దిద్దుబాటు చర్యల(ప్రాంప్టడ్‌ కరెక్టివ్‌ యాక్సన్‌(పీసీఏ))ను ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌) ప్రారంభించడంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో 5 శాతం నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ అధిక మొత్తంలో మొండిబకాయిలను కలిగివుండడంతోపాటు, మూలధనం తగినంత లేకపోవడం, వరుసగా రెండేళ్ల నుంచి ఆస్తులపై ప్రతికూల రాబడులను ఇవ్వడం వలన ఆర్‌బీఐ ఈ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. దీంతో ఈ

Most from this category