News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు

Monday 7th October 2019
Markets_main1570432338.png-28755

లాభాల మార్కెట్లోనూ ప్రభుత్వరంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ 1శాతం నష్టంతో 2156.20 వద్ద ట్రేడ్‌ అవుతోం‍ది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేరైన సిండికేట్‌ బ్యాంక్‌ 3.50శాతం నష్టపోయింది. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ 2.50శాతం క్షీణించాయి. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 2శాతం పతనమయ్యాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నష్టపోయాయి.  సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. 

ఇదే సమయానికి ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 174 పాయింట్ల లాభంతో 37,847 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 11,204.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, మెటల్‌, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక రంగ షేర్లు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండగా, రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఫార్మా, ఐటీ, అటోరంగ షేర్లకు అమ్మకాల మద్దతు లభిస్తుంది. 



You may be interested

దొంగ కంపెనీలు ఎప్పటికీ మారవు: పొరింజు

Monday 7th October 2019

  నమ్మదగిన కంపెనీలలో మాత్రమే ఇన్వెస్ట్‌ చేయాలని, ఇంటెగ్రిటీ ఉన్న కంపెనీలు మాత్రమే నిలకడగా రాణిస్తాయని దలాల్‌స్ట్రీట్‌ సీనియర్‌ ఇన్వెస్టర్‌ పొరింజు వెలియత్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘చాలా వరకు దొంగ కంపెనీలు ఎప్పటికి మారవు! నన్ను నమ్మండి, చేంజ్‌ ఇండియా థీమ్‌లో భాగంగా ఇన్వెస్ట్‌ చేసి నా చేతులు కాల్చుకున్నాను’ అని పొరింజు వెలియత్‌ ట్వీట్‌ చేశారు. ‘హిస్టోరిక్‌ డిటాక్సిఫికేషన్‌ డ్రై’ లో భాగంగా ఈ దొంగ కంపెనీలు

15-35 శాతం రాబడులనిచ్చే 3 స్టాకులు!

Monday 7th October 2019

గత కొన్ని సెషన్ల నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా చాలా వరకు స్టాకులు రోజువారి చార్టులో ట్రెండ్‌ రివర్సల్‌ను ఏర్పర్చాయి. ప్రస్తుతం ఈ స్టాకులను కొనుగోలు చేయడం మంచిదని నార్నోలియ ఫైనాన్సియల్‌ అడ్వజర్స్‌, టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ రిసెర్చ్‌ హెడ్‌ షబ్బిర్‌ ఖయ్యుమి అన్నారు. సాంకేతిక విశ్లేషణ ఆధారంగా సమీప కాలంలో 15-35 శాతం రిటర్న్‌లివ్వగలిగే 3 స్టాకులను సిఫార్సు చేశారు.  ముంజాల్‌ ఆటో ఇండస్ట్రీస్‌: సుమారు

Most from this category