News


అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Tuesday 14th January 2020
news_main1578980278.png-30917

అరశాతానికి పైగా నష్టపోయి నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌
ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌లోని పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అరశాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,467.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల అమ్మకాల్లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు అమ్మకాల సెగ తగిలింది. ఫలితంగా ఒకదశలో అరశాతం నష్టపోయి 2,456.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,468.70)తో పోలిస్తే 0.35శాతం నష్టంతో 2,460.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లోని ఎస్‌బీఐ, పీఎస్‌బీ షేర్లు 1శాతం నష్టపోయాయి. ఇండియన్‌బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఇదే రం‍్గానికి చెందిన జమ్మూ&కాశ్మీర్‌, ఐఓబీ, మహారాష్ట్ర బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు స్వల్పంగా 0.10శాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయానికి ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు సైతం అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయి 32,018.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

హెచ్‌ఏఎల్‌, దీపక్‌ జూమ్‌- కాఫీ డే వీక్‌

Tuesday 14th January 2020

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ అప్‌ దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ ప్లస్‌లో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ డీలా కొద్ది రోజులుగా సరికొత్త గరిష్టాలను తాకుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న సానుకూల వార్తల కారణంగా పీఎస్‌యూ రంగ ఇంజినీరింగ్‌ కంపెనీ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌), ప్రయివేట్‌ రంగ సంస్థ దీపక్‌ ఫెర్టిలైజర్స్‌.. కౌంటర్లకు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ

రూ.39,500 దిగువకు బంగారం

Tuesday 14th January 2020

దేశీయంగా బంగారం ధర మంగళవారం రూ.39500 దిగువకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు వారంరోజుల గరిష్టం నుంచి వెనక్కిరావడం, దేశీయ ఫారెక్స్‌మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా ఆరోరోజూ బలపడటంతో తదితర అంశాలు బంగారానికి డిమాండ్‌ను తగ్గించాయి. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సరికి రూ.350లు నష్టపోయి రూ.39546 వద్ద స్థిరపడింది. నేడు రూ.39,500 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌లో 10గ్రాముల పసిడి ధర నిన్నటి ముగింపు

Most from this category