News


నష్టాల్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు

Monday 30th December 2019
Markets_main1577688878.png-30527

మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు సోమవారం​ఉదయం సెషన్‌లో అమ్మకాల ఒత్తిడిలోనయ్యాయి. ఆర్‌బీఐ చేపట్టిన ఆపరేషన్‌ ట్విస్ట్‌ ప్రక్రియతో పాటు నిన్నటి వారంలో శనివారం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బ్యాంకు అధికారులతో చర్చలు బ్యాంకింగ్‌ రంగ షేర్లపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.25శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,569.95 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో కొంతవరకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ 0.10శాతం పెరిగి 2570.80 వద్దకు పెరిగింది. అయితే లాభాల స్వీకరణతో పాటు మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కారణంగా పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఫలితంగా ఇంట్రాడే గరిష్టం(2570.80) నుంచి 1.88శాతం లాభపడి 2525.25 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం 12:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,568.45)తో పోలిస్తే 1.65శాతం నష్టంతో 2,526.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా పంజాజ్‌ సింధ్‌ బ్యాంక్‌ 6.50శాతం నష్టపోయింది. ఐఓబీ 3శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 2.20శాతం, పీఎన్‌బీ 2శాతం, యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, సెం‍ట్రల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయింది. జమ్మూ & కాశ్మీర్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

చిన్న స్టాకుల్లో వాటాలు పెంచుకున్న ఎంఎఫ్‌లు!

Monday 30th December 2019

2020లో పరుగులు తీస్తాయన్న అంచనాలు ఈ సంవత్సరం చాలా మంది మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు చిన్నస్టాకులపై మక్కువ చూపారు. దాదాపు 100కుపైగా చిన్న కంపెనీల్లో ఎంఎఫ్‌లు 2019లో వాటాలు పెంచుకున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు స్టాకులు ఈ సంవత్సరం నెగిటివ్‌ రాబడులే ఇచ్చాయి. మార్కెట్లో లార్జ్‌క్యాప్స్‌ హవా కొనసాగుతున్నందున చిన్నస్టాకుల ర్యాలీ ఇంకా మొదలవ్వలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్రమంగా స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ పరుగులు ఆరంభమవుతాయని అంచనా వేస్తున్నారు.

పాలీకేబ్‌ ఐపీవో- 8 నెలల్లో 80 శాతం అప్‌

Monday 30th December 2019

పబ్లిక్‌ ఇష్యూ విభాగంలో టాప్‌-5లో చోటు టాప్‌ ర్యాంకర్స్‌- ఐఆర్‌సీటీసీ, ఇండియామార్ట్‌  ఈ ఏడాది(2019) చివరికల్లా దేశీ స్టాక్‌ మార్కెట్లు పలు ఒడిదొడుకుల మధ్య రికార్డు గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. మరోవైపు ఐపీవో మార్కెట్లోనూ కొంతమేర సందడి కనిపించింది. ఇష్యూలు తగ్గిన్పటికీ ఈ ఏడాది స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన కంపెనీలలో అత్యధికం ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం విశేషం! ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టిన కంపెనీలలో టాప్‌-5లో

Most from this category