STOCKS

News


ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Thursday 28th November 2019
Markets_main1574924139.png-29925

మిడ్‌సెషన్‌ సమయానికి ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రభుత్వరంగ ఇండెక్స్‌ 3.50 శాతం లాభపడింది. ఓరియంటల్‌ బ్యాంక్‌ అత్యధికంగా 7.50శాతం లాభపడింది. యూనియన్‌ బ్యాంక్‌ 7శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 6.50శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 6శాతం, జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ 6.50శాతం ర్యాలీ చేశాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం, అలహదాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3శాతం లాభపడ్డాయి. కెనరా బ్యాంక్‌,  సిండికేట్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం పెరిగాయి. మధ్యాహ్నం గం.12:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,625.30)తో పోలిస్తే 3.33శాతం లాభంతో 2,714.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇక మార్కెట్‌ విషయానికోస్తే...నిన్నటి ట్రేడింగ్‌లో రికార్డు గరిష్టం వద్ద ముగిసిన సూచీలు నేటి ట్రేడింగ్‌లో కొత్త రికార్డు నెలకొల్పాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఐటీ రంగ షేర్ల ర్యాలీ ఇందుకు తోడ్పాటునిచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ కిత్రం ముగింపు(41,020.61)తో పోలిస్తే 144 పాయింట్లు పెరిగి 41,163.79 వద్ద, నిఫ్టీ గత ముగింపు(12,100.70)తో పోలిస్తే 44 పాయింట్లు లాభపడి 12,144.40 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ 260 పాయింట్లను ఆర్జించి 32,135.90 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. 



You may be interested

రిలయన్స్‌ కదులుతున్న రైలు!

Thursday 28th November 2019

‘రిలయన్స్‌ కదులుతున్న ట్రైన్‌ లాంటింది. ప్రస్తుత స్థాయిల వద్ద ఈ షేరును కొనుగోలు చేయడం ఉత్తమం కాదు. కానీ ఈ షేరు దిద్దుబాటుకు గురయినప్పుడు కొనుగోలు చేయడం మంచిది. కానీ రిలయన్స్‌లో ఇప్పటికే ఇన్వెస్టర్‌గా ఉన్నవాళ్లు మరికొన్ని షేర్లను జోడించుకోండి. ప్రస్తుత స్థాయి నుంచి రిలయన్స్‌ 8-10 శాతం కదులుతుందని అంచనా వేస్తున్నాం. కానీ కొత్త పెట్టుబడులకు ఈ షేరు మంచి రిస్క్‌ రివార్డును అందించలేదు’ అని ఎలిక్సిర్‌ ఈక్విటీస్‌,

మరింత ర్యాలీ కష్టమే!

Thursday 28th November 2019

బడా బ్రోకరేజ్‌ల అంచనాలు దేశీయ ఎకానమీలో మందకొడితనం దేశీయ స్టాక్‌ సూచీలను నిలువరించలేకపోతోంది. ఒకపక్క ఎకానమీ నానాటికీ మందగమనంలోకి పయనిస్తుండగా, స్టాక్‌ సూచీలు ఆల్‌టైమ్‌ హైలను తాకుతున్నాయి. ఈ విధమైన వ్యత్యాస ప్రవర్తన ఇకపై ముగిసిపోనుందని, మార్కెట్‌లో మరింత ర్యాలీ ఇకముందు కష్టమేనని బీఎన్‌పీ పారిబా అభిప్రాయపడింది. ఇటీవలి కాలంలో పలువురు విధాన నిర్ణేతలు, పరిశ్రమ నిపుణులతో సమావేశం జరిపామని, ఆర్థిక గణాంకాలు వెనువెంటనే మెరుగుపడకపోవచ్చని వీరిలో ఎక్కువమంది అంచనా వేస్తున్నారని

Most from this category