News


లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌

Thursday 21st November 2019
news_main1574315989.png-29755

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,572.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అరశాతం పెరిగి 2,605.95 వద్ద చేరకుంది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,572.25)తో పోలిస్తే 0.25శాతం లాభంతో 2,578.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సెం‍ట్రల్‌ బ్యాంక్‌ షేరు 1శాతం పెరిగింది. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ, పీఎన్‌బీ షేరు అరశాతం నుంచి 0.10శాతం వరకు పెరిగాయి. మరోవైపు ఇండెక్స్‌లో సిండికేట్‌ బ్యాంక్‌, జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌, ఇండియా బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం నష్టపోగా, యూనియన్‌బ్యాంక్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 0.10శాతం స్వల్పంగా నష్టపోయింది. 



You may be interested

టాప్‌ మిడ్‌క్యాప్‌ రికమండేషన్లు!

Thursday 21st November 2019

దేశీయ మార్కెట్లో చిన్న స్టాకుల టర్నెరౌండ్‌ ఆరంభమవుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌ను రికమండ్‌ చేస్తున్నాయి. ఏడాది కాలానికి వీటిని పరిశీలించవచ్చని సిఫార్సు చేస్తున్నాయి. మోతీలాల్‌ఓస్వాల్‌ సిఫార్సులు: కాల్గేట్‌ పామోలివ్‌, అశోక్‌ లేలాండ్‌, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌, ఇండియన్‌ హోటల్స్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, సీజీ కన్జూమర్‌ కేర్‌, జేకే సిమెంట్‌ తదితరాలు. బ్రోకరేజ్‌ సిఫార్సు చేసిన షేర్లు, వాటి టార్గెట్లు,

ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Thursday 21st November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం సెషన్‌లో ప్లాట్‌గా 71.83 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఖరారుపై ఆందోళనలు పెరగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 10 పైసలు బలహీనపడి 71.81 వద్ద ముగిసింది. హాంగ్‌కాంగ్‌లో ఉద్రిక్తతల వలన అమెరికా-చైనా ట్రేడ్‌ డీల్‌ మరింత ఆలస్యమవతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గురువారం సెషన్‌లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ

Most from this category