News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌కు కొనుగోళ్ల మద్దతు

Monday 25th November 2019
Markets_main1574666002.png-29834

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేటి మిడ్‌సెషన్‌ కల్లా 1.50శాతం ర్యాలీ చేసింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,562.05 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ రంగ షేర్ల కొనుగోళ్లకు ఆస్తకి చూపడంతో ఇండెక్స్‌ ఒక దశలో 1.50శాతం లాభపడి 2,595.55స్థాయికి ఎగిసింది. మధ్యాహ్నం 12:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,559.65)తో పోలిస్తే 1శాతం పెరిగి 2,584.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ 2శాతం ర్యాలీ చేశాయి. ఎస్‌బీఐ బ్యాంక్‌ 1.50శాతం, జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎస్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం పెరిగాయి. అలాగే సెంట్రల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అరశాతం లాభపడ్డాయి. మరోవైపు అలహదాబాద్‌ బ్యాంక్‌ అరశాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 0.10శాతం నష్టపోయాయి. 



You may be interested

బంగారం దిగుమతులు తగ్గుముఖం

Monday 25th November 2019

ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో 9 శాతం క్షీణత దేశీయ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) పై ప్రభావం చూపే బంగారం దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ కాలంలో 9 శాతం తగ్గాయి. సమీక్షిస్తున్న కాలంలో భారత్ 17.63 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. మన కరెన్సీలో ఇది రూ.1.25 లక్షల కోట్లు. క్రితం ఏడాది ఇదే సమయంలో దిగుమతి చేసుకున్న 19.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే తొమ్మిది శాతం

పాజిటివ్‌గా మెటల్‌ షేర్లు..జిందాల్‌ స్టీల్‌ 6% అప్‌

Monday 25th November 2019

అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండడంతో దేశీయ మెటల్‌ షేర్లు సోమవారం సెషన్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నాం 12.13 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.51 శాతం లాభపడి 2,584.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  జిందాల్‌ స్టీల్‌ 5.93 శాతం పెరిగి రూ. 152.70 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 144.20 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం సెషన్‌లో రూ. 145.15 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది.

Most from this category