News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోలు మద్దతు

Monday 11th November 2019
Markets_main1573452232.png-29502

మార్కెట్‌ పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్న తరుణంలో.... ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ దాదాపు 1.50శాతం లాభపడింది. ఈ ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు 5.50శాతం లాభపడింది. శుక్రవారం మెరుగైన ఫలితాలు ప్రకటించడటం షేరు ర్యాలీకి కారణమైంది. అలాగే బ్యాంక్‌ ఇండియా 2శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 1శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం వరకు నష్టపోయాయి. అలహదాబాద్‌ బ్యాంక్‌ 1.50శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంకు షేర్లు 1శాతం నుంచి అరశాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,437.05)తో పోలిస్తే 0.75శాతం పెరిగి 2,451.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇదే సమయానికి సెన్సెక్స్‌ 86 పాయింట్ల నష్టంతో 40,237.10 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లను కోల్పోయి 11900 దిగువున 11,877.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

మార్కెట్‌పై మూడీస్‌ ప్రభావం తాత్కాలికమే!

Monday 11th November 2019

బుల్‌ రన్‌ కొనసాగుతుంది  నిపుణుల అంచనా భారత ఎకానమీ అవుట్‌లుక్‌ను మూడీస్‌ రేటింగ్‌ ఏజన్సీ డౌన్‌గ్రేడ్‌ చేసిన ప్రభావం మార్కెట్‌పై స్వల్పకాలమే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిస్కులు పెరిగాయని చెబుతూ గతవారం మూడీస్‌ సంస్థ భారత క్రెడిట్‌ అవుట్‌లుక్‌ను నెగిటివ్‌కి డౌన్‌గ్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే! దీంతో మార్కెట్లు నెగిటివ్‌గా రియాక్టయ్యాయి. కానీ త్వరలో ఈ ప్రభావం సమసి పోతుందని, ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణాత్మక చర్యలు మార్కెట్లో జోష్‌ తెస్తాయని అనలిస్టులు

పెరిగిన అమరరాజా నికర లాభం..షేరు 7% అప్‌

Monday 11th November 2019

అమరరాజా బ్యాటరీస్‌ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.218.85 కోట్లకు పెరిగింది. గత త్రైమాసికాల కంటే ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం అత్యధికంగా పెరగడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్యార్టర్‌లో కంపెనీ నికర లాభం రూ. 120.23 కోట్లుగా నమోదైంది. కానీ కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 3 శాతం తగ్గి రూ. 1753.05 కోట్ల నుంచి రూ. 1695.31 కోట్లకు పడిపోయింది. కంపెనీ షేరుపై

Most from this category