STOCKS

News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌ జోరు

Thursday 2nd January 2020
Markets_main1577960328.png-30620

దేశీయ ఈక్విటీ మార్కెట్లో ప్రభుత్వరంగ షేర్లకు గురువారం భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.05శాతం పెరిగింది.  నేడు పీఎస్‌యూ ఇండెక్స్‌ 2,530.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం నుంచి లాభాల్లో కదలాడినప్పటికీ.., మిడ్‌సెషన్‌ కొనుగోళ్లు ఇండెక్స్‌ను మరింత పరుగులు పెట్టించాయి. ఒక దశలో ఇండెక్స్‌ 2.22శాతం వరకు పెరిగి 2582.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి 1.99శాతం లాభంతో 2,576.60 వద్ద ముగిసింది. ఉదయం ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లు సూచీలకు లాభాల ట్రేడింగ్‌కు కారణవగా, మిడ్‌సెషన్‌ బ్యాంకింగ్‌ రంగ షేర్లు సూచీల అండగా నిలిచాయని చెప్పవచ్చు. ఈ నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌లో అత్యధికంగా పంజాజ్‌ సింధ్‌ బ్యాంక్‌ 4.50శాతం లాభపడింది. కెనరా బ్యాంక్‌ 3.50శాతం పెరిగింది. పీఎన్‌బీ 3.25శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.50శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ షేరు 2శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 1.50శాతం, ఎస్‌బీఐ షేరు 1.25శాతం, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంక్‌, ఐఓబీ, జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. మరోవైపు మహారాష్ట్ర బ్యాంక్‌ షేరు మాత్రం ఎలాంటి లాభనష్టాన్ని చవిచూడకుండా అక్కడిక్కడే ముగిసింది. 



You may be interested

బుల్‌ జోరు- సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ

Thursday 2nd January 2020

సెంచరీతో నిఫ్టీ.. క్లోజింగ్‌ రికార్డ్‌ మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ జూమ్‌ దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొత్త ఏడాది తొలి రోజు కనిపించిన హుషారు వరుసగా రెండో రోజు కొనసాగింది. దీంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సెంచరీ కొట్టింది. దీంతో సెన్సెక్స్‌ 321పాయింట్లు జంప్‌చేసి 41627 వద్ద నిలవగా.. నిఫ్టీ 100 పాయింట్లు ఎగసి 12283 వద్ద ముగిసింది. వెరసి తద్వారా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టానికి చేరువలో స్థిరపడగా.. నిఫ్టీ

లార్జ్‌క్యాప్స్‌ కంటే మిడ్‌క్యాప్స్‌ మిన్న!

Thursday 2nd January 2020

ఈ ఏడాది స్మాల్‌ క్యాప్స్‌ టర్న్‌అరౌండ్‌? రికవరీ వస్తుందన్న నమ్మకముంటే..లార్జ్‌ క్యాప్స్‌ కంటే మిడ్‌ క్యాప్స్‌లోనే అత్యధిక రిటర్నులు పొందవచ్చునంటున్నారు.. సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో సునీల్‌ సుబ్రమణ్యం. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతేడాది మార్కెట్ల తీరు, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో భారీ ర్యాలీ తదితర పలు అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు చూద్దాం.. ప్రధానంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిపై ఆధారపడి కదులుతుంటాయి. ఈ ఏడాది జీడీపీ

Most from this category