News


రాణిస్తున్న ప్రభుత్వరంగ షేర్లు

Monday 4th November 2019
Markets_main1572850056.png-29331

మార్కెట్‌కు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతలో భాగంగా సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రభుత్వరంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రభుత్వరంగ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2శాతానికి పైగా లాభపడింది. నేడు ఇండెక్స్‌ 2,558.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం లాభపడింది. ఇండియన్‌ బ్యాంక్‌ 3శాతం, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 2.50శాతం ర్యాలీ చేశాయి. అలహదాబాద్‌ బ్యాంక్‌, జమ్మూ, కాశ్మీర్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం పెరిగాయి. కెనరా బ్యాంక్‌, ఎస్‌బీఐ 1శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ అరశాతం ర్యాలీ లాభపడ్డాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌బ్యాంక్‌ షేర్లు అరశాతం వరకు నష్టపోయాయి. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,542.45)తో పోలిస్తే 1.80శాతం లాభంతో 2570.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


ఇదే సమయానికి ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 40,270 వద్ద ట్రేడవ్వగా, నిఫ్టీ 50 పాయింట్లు పెరుగుదలతో 11,940.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో ఆటో షేర్లు

Monday 4th November 2019

మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌ ఉదయం ఆర్జించిన లాభాల్ని కోల్పోయింది. మెటల్‌ ఐటీ షేర్ల ర్యాలీతో ఉదయం సెషన్‌లో సెన్సెక్స్‌ సెనెక్స్‌ 318 పాయింట్లును, నిఫ్టీ 99 పాయింట్లను ఆర్జించిన సంగతి తెలిసిందే. మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్న ఆటో రంగ షేర్లు మిడ్‌సెషన్‌ సమయానికి సూచీల లాభాల్ని హరించివేశాయి. ఎన్‌ఎస్‌ఈలో ఆటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.50శాతం శాతం నష్టపోయింది. గతవారం మార్కెట్‌

ఇన్ఫీ షేరు 6 శాతం అప్‌

Monday 4th November 2019

ఆరోపణలపై ఆధారాల్లేవన్న కంపెనీ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేరు సోమవారం మధ్యాహ్న ట్రేడింగ్‌ సమయానికి అనూహ్యంగా కోలుకొని దాదాపు 6 శాతం పైగా దూసుకుపోయింది. మునుపటి క్లోజింగ్‌ 687.90రూపాయల దిగువన ఆరంభమైన షేరు ఒకదశలో 678 రూపాయల వరకు పతనమైంది. అయితే కంపెనీపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాల్లేవన్న ప్రకటనతో షేరు ఒక్కసారిగా లాభాల్లోకి మరలింది. అలా స్పీడుగా దాదాపు 6.5 శాతం లాభపడి రూ.732 వద్ద

Most from this category