News


పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Wednesday 23rd October 2019
Markets_main1571809000.png-29079

గత కొన్ని నెలల నుంచి దిద్దుబాటుకు గురవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోలు మద్ధతు లభిస్తోంది. దీంతో పాటు ఈ వారంలో ఎస్‌బీఐ క్యూ2 ఫలితాలు వెలువడడనుండడంతో ఎస్‌బీఐ షేరు పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఫలితంగా బుధవారం సెషన్‌లో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌​ ఉదయం 10.58 సమయానికి 1.54 శాతం లాభపడి 2,295.90 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఇండియన్‌ బ్యాంక్‌ 4.24 శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 2.29 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 2.06 శాతం, బ్యాంక్‌ ఇండియా 2.02 శాతం, ఎస్‌బీఐ 1.87 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.55 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 1.52 శాతం, కెనరా బ్యాంక్‌ 1.16 శాతం, పీఎన్‌బీ 0.82 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 0.20 శాతం, అలహాబాద్‌ బ్యాంక్‌ 0.19 శాతం లాభపడి ట్రేడవుతుండగా, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ మాత్రం 0.47 శాతం నష్టపోయి ట్రేడవుతోంది.



You may be interested

ఝున్‌ఝున్‌వాలా వాటాను పెంచుకున్న షేర్లివే!

Wednesday 23rd October 2019

   బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా సెప్టెంబర్‌ నెలలో 5 కంపెనీలలో తన వాటాను పెం‍చుకోగా, 15 కంపెనీలలో తన వాటాను స్థిరంగా ఉంచుకున్నారని ఏసీఈ ఈక్విటీ డేటా పేర్కొంది. ఫెడరల్ బ్యాంక్, వీఐపీ ఇండస్ట్రీస్, అగ్రో టెక్ ఫుడ్స్, ఎన్‌సీసీ, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్ కంపెనీలలో ఈ సీనియర్‌ ఇన్వెస్టర్‌ తన వాటాను పెంచుకున్నారు. కాగా ఈ కంపెనీల షేరు విలువ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 9-40

కొనసాగుతున్న బ్రెగ్జిట్‌ అనిశ్చితి : 6 డాలర్లు పెరిగిన పసిడి

Wednesday 23rd October 2019

యూరోజోన్‌లో కొనసాగున్న బ్రెగ్జిట్‌ అనిశ్చితి కారణంగా బుధవారం పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ నెలకొంది. ఆసియాలో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 6డాలర్లు పెరిగి 1,493.55డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్రెగ్జిట్‌కు సంబంధించిన బిల్లుకు బ్రిటన్‌ శాసనసభ్యులు ఓటువేశారు. అయితే మూడు రోజుల్లోగా ఆమోదించాలన్న ప్రధాని బోరిస్‌ జాన్సస్‌ టైమ్‌ టేబిల్‌ను తిరస్కరించారు. అనుకున్న గడువు అక్టోబర్‌ 31న లోగా బిట్లు ఆమోదం కాకపోతే, బ్రెగ్జిట్‌ బిల్లు రద్దు చేసుకుని,

Most from this category