STOCKS

News


పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల జోరు

Thursday 23rd January 2020
Markets_main1579776491.png-31143


ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల ర్యాలీ

గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్ల అమ్మకాలు ఒత్తిడికి లోనైతే, ఇతర రంగాల షేర్లు పెరిగాయి. వీటిలో అధికంగా పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు జోరు చూపించాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్ల మద్దతు లభించడంతో నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.24 శాతం పెరిగి  2,439.90 వద్ద ముగిసింది.సెంట్రల్‌ బ్యాంక్‌ 2.43 శాతంతో 19.00 వద్ద, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2.21 శాతంతో 323.15 వద్ద, యూనియన్‌ బ్యాంక్‌  2.14 శాతంతో 52.60 వద్ద, పీఎన్‌బీ బ్యాంక్‌ 1.39 శాతంతో 61.85 వద్ద, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.01 శాతంతో 95.25 వద్ద ముగిసాయి.



You may be interested

12000-12500 మధ్య ఉన్నంత వరకు స్ట్రాంగిల్స్‌ అమ్మొచ్చు!

Thursday 23rd January 2020

ఆప్షన్‌ నిపుణుల సూచన నిఫ్టీ స్వల్పకాలానికి 12000- 12500 పాయింట్ల రేంజ్‌లోనే కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆప్షన్‌ డేటా చూస్తే ఈ రేంజ్‌ జనవరి సీరిస్‌ వరకు కొనసాగవచ్చని చెబుతున్నారు. ఈ సీరిస్‌ ముగిసేందుకు మరో వారం మాత్రమే గడువున్నందున నిఫ్టీలో స్ట్రాంగిల్స్‌ విక్రయించే వ్యూహాలు మంచివని సూచిస్తున్నారు.(షార్ట్‌ స్ట్రాంగిల్‌- స్వల్పదూరంలోని అవుట్‌ఆఫ్‌ద మనీ పుట్‌, కాల్‌ను విక్రయించడం) ఈ రేంజ్‌ బ్రేక్‌ అయ్యేవరకు స్ట్రాంగిల్‌ సెల్లింగ్‌ లాభాలనిస్తుందని విశ్లేషిస్తున్నారు. నిఫ్టీ

ద్రవ్యోల్బణ ఎఫెక్ట్‌: ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లు యథాతథమే..!

Thursday 23rd January 2020

డిసెంబర్‌లో ద్రవ్యోల్బణ స్థాయి గణనీయంగా నమోదు కావడంతో ఫిబ్రవరిలో జరిగే ‍ద్రవ్యపరిపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని రాయిటర్‌ అధ్యయన నివేదికలో పేర్కోంది. ‘‘డిసెంబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్టానికి చేరి 7.35శాతంగా నమోదైంది. జనవరిలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్య శ్రేణిని మించి ద్రవ్యోల్బణ గణంకాలు నమోదు కావడంతో వడ్డీరేట్ల తగ్గింపుపై పునరాలోచనలో పడింది.’’ అన్ని రాయిటర్స్‌  తెలిపింది.

Most from this category