News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌ జోరు

Friday 28th June 2019
Markets_main1561704671.png-26649

2.50శాతం ర్యాలీ చేసిన ​పీఎస్‌యూబ్యాంక్‌ ఇండెక్స్‌ 
కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.40 వేల కోట్ల అదనపు నిధులను కేటాయించవచ్చనే అంచనాలతో శుక్రవారం ఈ రంగానికి చెందిన షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 31,281.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి పీఎస్‌యూ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ 2.50శాతం లాభపడి 3,260.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,184.30)తో పోలిస్తే 2శాతం లాభంతో 3,246.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 


ఆర్‌బీఐ మిగులు నిధుల్లోంచి కొంత మొత్తాన్ని పీఎస్‌యూ బ్యాంకులకు కేటాయించి చిన్నాభిన్నమైన వాటి ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టాలని జలాన్‌ కమిటి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌యూ) ప్రైవేటీకరణకు ఇది సరైన సమయం కాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. పీఎస్‌యూ బ్యాంకుల వాల్యూవేషన్లు, బ్యాంకు యూనియన్ల వ్యతిరేకత, జాతీయ బ్యాంకు చట్టంలోకి కొన్ని కీలక అంశాలు ప్రైవేటీకరణకు అవరోధాలు మారనున్నాయి. బలహీనంగా తయారైన ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థికస్థితి ప్రైవేటీకరణకు ప్రధాన అడ్డంకి మారనుందని కేంద్రం అభిప్రాయపడుతుంది. అలాగే ఈ పీఎస్‌యూ బ్యాంకుల్లో తన మొత్తం వాటాలను  51శాతానికి పరిమితం చేసేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నది.


యూనియన్‌ బ్యాంక్‌ 6.50శాతం, సెంట్రల్‌ బ్యాంకు 6శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4.50శాతం, కెనరా బ్యాంకు 4శాతం, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంకు 4శాతం, ఓరియంటల్‌ బ్యాంకు 3శాతం లాభపడ్డాయి. బ్యాంకు ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు షేర్లు 2శాతం నుంచి 1శాతం పెరిగాయి. అలాగే ఎస్‌బీఐ షేరు అరశాతం ర్యాలీ చేసింది. మరోవైపు జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ 3శాతం క్షీణించగా, అలహదబాద్‌ బ్యాంకు అరశాతం నష్టపోయింది. 



You may be interested

హెచ్‌డీబీ ఫైనాన్షియల్స్‌ విలువ రూ.80,000కోట్లు

Friday 28th June 2019

హెచ్‌డీఎఫ్‌సీ బ్రాండే కారణం హెచ్‌డీఎఫ్‌సీ బాంక్‌కు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ రంగ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ విలువ అనధికార మార్కెట్లో రూ.80,000కోట్లుగా ఉంది. ఇది ఇంకా మార్కెట్లో లిస్ట్‌ కాలేదు.  ఇతర ఎన్‌బీఎఫ్‌సీల ప్రస్తుత విలువల ప్రకారం చూస్తే  దేశంలో నాలుగవ అతి పెద్ద నాన్‌బ్యాంకింగ్‌ సంస్థ.. ఇదే అవుతుంది. ‘హెచ్‌డీబీ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కి రానుందనే నేపథ్యంలో దీని షేరు విలువ అనధికార మార్కెట్లో రూ.1,000-1,050గా ఉంది. కంపెనీ విలువ సూమారు రూ.82,000గా

ఈ నెల కూడా బుల్లిష్‌ రోలోవర్లే అధికం!

Friday 28th June 2019

జూలై సీరిస్‌లోకి ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో బుల్లి్‌ష్‌ రోలోవర్లు అధికంగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గురువారం జూన్‌ సీరిస్‌ ముగిసిపోవడంతో లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు తమ పొజిషన్లను జూలై సీరిస్‌కు మార్చుకున్నారు. అంతర్జాతీయ టెన్షన్లు, రుతుపవనాల జాప్యం, మందగమన భయాల నేపథ్యంలో మార్కెట్లో ఆశావహ ధృక్పథం తక్కువగా ఉంది. ఈ వారం బడ్జెట్‌ రానున్న నేపథ్యంలో రోలోవర్లు అధికంగా జరిగాయని నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్లో వచ్చే కీలక ప్రకటనల ఆధారంగా తదుపరి

Most from this category