రాణిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు
By Sakshi

మార్కెట్ స్థిరమైన ర్యాలీలో భాగంగా గురువారం బ్యాంకింగ్ రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ 2శాతం వరకు లాభపడింది. నేడు ఈ ఇండెక్స్ 3,269.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అస్తవ్యస్తమైన ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు పునురుద్ధరణకు రిక్యాపులైజేషన్ ప్రకటించే అవకాశం ఉందనే అంచనాలతో ఈ రంగ షేర్లకు నేడు డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ రంగానికి చెందిన అలహదాబాద్ బ్యాంకు షేర్లు 4శాతం లాభపడ్డాయి. బ్యాంకు ఆఫ్ బరోడా 3శాతం, సిండికేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 2.50శాతం పెరిగాయి. యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంకు షేర్లు 2శాతం వరకు పెరిగాయి. ఇండియా బ్యాంకు, పంజాజ్ నేషనల్ బ్యాంకు, జమ్మూ&కాశ్మీర్ బ్యాంక్ 1.50శాతం లాభపడ్డాయి. అలాగే ఎస్బీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. ఉదయం గం.10:30ని.లకు ఇండెక్స్ గత ముగింపు(3,255.65)తో పోలిస్తే 1.85శాతం(59 పాయింట్లు) లాభంతో 3,314.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి సెన్సెక్స్ 113 పాయింట్ల లాభంతో 39,952.38 వద్ద, నిఫ్టీ 38.65 పాయింట్లు పెరిగి 11950లపైన 11,955 వద్ద ట్రేడ్ అవుతోంది.
You may be interested
ఎస్బీఐ కొత్త రికార్డు
Thursday 4th July 2019స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) షేర్లు గురువారం కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకాయి. నేడు ఎన్ఎస్ఈలో ఈ షేర్లు రూ.367.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్ సెషన్లో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్ల ర్యాలీ భాగంగా ఎస్బీఐ షేర్లకు డిమాండ్ పెరగడంతో ఎస్బీఐ షేర్లు 1.29శాతం పెరిగి రూ.370.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఇది షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.10:45ని.లకు షేరు గతముగింపు(రూ.366.15)తో పోలిస్తే
31,500పైన బ్యాంక్ నిఫ్టీ
Thursday 4th July 2019బ్యాంకు నిప్టీ ఇండెక్స్ గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో అరశాతానికి పైగా లాభపడింది. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్ 31,471.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుడంతో ఈ ఇండెక్స్ 0.63శాతం (200 పాయింట్లు) లాభపడి 31582.50 స్థాయి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9:45ని.లకు ఇండెక్స్ గతముగింపు(31,382.30)తో పోలిస్తే 0.58శాతం లాభంతో 31,564.20 వద్ద ట్రేడ్ అవుతోంది.