News


అమ్మకాల ఒత్తిడిలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Tuesday 18th February 2020
news_main1582008638.png-31892

3శాతం నష్టాన్ని చవిచూసిన పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 
మార్కెట్‌ నెలకొన్న అమ్మకాల ఒత్తిడిలో భాగంగా ప్రభుత్వరంగ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేడు 2,145.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను స్వల్పంగా చెల్లించినప్పటికీ, బ్యాంకింగ్‌ రంగంలో మొండి రుణాలపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వ రంగ షేర్లను విక్రయిస్తున్నారు. ఫలితంగా ఒకదశలో 3శాతానికి (67 పాయింట్లు) పైగా నష్టాన్ని చవిచూసి 2078 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, పీఎస్‌బీ బ్యాంకు షేర్లు 52వారాల ‍కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం 12గంటలకు ఇండెక్స్‌ ఇండెక్స్‌ 2.50శాతం నష్టంతో 2080 వద్ద ట్రేడ్‌ అవుతోంది. యూనియన్‌ బ్యాంక్‌ అత్యధికంగా 8.50శాతం నష్టపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌ 3.50శాతం నష్టాన్ని చవిచూశాయి. పీఎన్‌బీ, ఇండియన్ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌ షేర్లు 3శాతం నష్టపోయాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ 2శాతం, మహారాష్ట్ర బ్యాంక్‌, పీఎస్‌బీ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్, ఐఓబీ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం క్షీణించాయి. ఒక్క జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 4శాతం లాభపడింది. 



You may be interested

నిఫ్టీలో లాంగ్‌ పొజిషన్స్‌ తీసుకోవచ్చు!

Tuesday 18th February 2020

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌  నిఫ్టీలో బుల్లిష్‌ జోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. నిఫ్టీ గతవారం చివరకు బుల్లిష్‌ పియర్సింగ్‌ లైన్‌ క్యాండిల్‌ ​ఏర్పరిచిందని తెలిపింది. నిఫ్టీ గత ర్యాలీ(11600- 12245)కు ఇంకా 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిలను కోల్పోలేదని తెలిపింది. ఈ ర్యాలీకి 38.2, 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిలు 12005, 11930 పాయింట్ల వద్ద ఉన్నాయని వివరించింది. అందువల్ల 11930 పాయింట్ల దిగువన నిఫ్టీ క్లోజయ్యేవరకు బుల్స్‌కు ఛాన్సులుంటాయని

ఆర్‌కామ్‌ 7 శాతం డౌన్‌!

Tuesday 18th February 2020

రూ.23.000 కోట్లను రికవరీ చేసేందుకు.. ప్రస్తుతం ఎన్‌సీఎల్‌టీ పరిధిలో వున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ఆస్తుల్ని విక్రయించడానికి కమిటీ ఆఫ్‌ క్రెడిటర్స్‌ కాల్‌ చేసిన బిడ్లకు   యూవీ అసెట్‌ రికనస్ట్రక‌్షన్‌ కంపెనీ, రిలయన్స్‌ జియోల బిడ్లు దాఖలు చేశాయి.  ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్‌కామ్‌ షేరు 7.14 శాతం పడిపోయి రూ.0.65 పైసలు వద్ద ట్రేడ్‌ అవుతోంది.   

Most from this category