News


అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లు

Wednesday 6th November 2019
Markets_main1573022189.png-29392

ఇటీవల రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన నేప్యథంలో కొన్ని ప్రధాన ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు మార్కెట్‌ వర్గాలను నిరాశపరచడంతో బుధవారం ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. నిన్న ఫలితాలను వెల్లడించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఫలితాలు అంచనాలకు అందుకోకపోవడం, ఏడురోజుల మార్కెట్‌ ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణలో భాగంగా ప్రభుత్వరంగ షేర్లలో అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా నేడు ఎన్‌ఎస్‌ఈలో  ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,539.10)తో పోలిస్తే 1.50శాతం నష్టంతో 2,502.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం నష్టపోయింది, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి. అలహదాబాద్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఇండియా బ్యాంక్‌ షేరు 1.10శాతం నష్టపోయాయి. ఆస్తుల నాణ్యత తగ్గడం, మొండిబకాయిలు పెరగడం, ఫ్రాఫిట్‌ విజిబిలిటి తగ్గడం తదితర సమస్యలు ఈ ఏడాదిలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 16శాతం నష్టపోయింది. 



You may be interested

దేవుడు కూడా ఇన్ఫోసిస్‌ నెంబర్లను మార్చలేడు!

Wednesday 6th November 2019

-నందన్‌ నిలేకని, ఇన్ఫీ చైర్మన్‌ కంపెనీ సొంత దర్యాప్తులో విజిల్‌ బ్లోయర్స్‌ ఫిర్యాదును బలపరిచే ఆధారాలు లభించలేదని ఇన్ఫోసిస్‌ చైర్మన్‌, సహవ్యవస్థాపకుడు నందన్‌నిలేకని బుధవారం వార్షిక విశ్లేషకులు సమావేశంలో అన్నారు. అంతేకాకుండా కంపెనీ సీఈఓ, సీఎఫ్‌ఓలపై గుర్తు తెలియని ఉద్యోగుల నుంచి వచ్చిన ఆరోపణలను ఇన్ఫోసిస్‌ ఖండిస్తున్నదని అన్నారు.  కంపెనీ సహ-వ్యవస్థాపకులు కంపెనీ దీర్ఘకాల వృద్ధికి కట్టుబడి వున్నారని, కంపెనీలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయని  తెలిపారు. వ్యక్తిగత ఇమేజ్‌ను

టైటాన్‌ 9.50శాతం డౌన్‌

Wednesday 6th November 2019

టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 9.50శాతం పతనమైంది. రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో పాటు వచ్చే రెండు తైమాసికంలో ఆభరణాల అమ్మకాల వృద్ధి గైడెన్స్‌ను తగ్గించడం ఇందుకు కారణమైంది.  నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలను విడుదల చేసింది. ఈ క్యూ‍2లో కంపెనీ నికరలాభం 4 వృద్ధి చెంది రూ.301 కోట్లు నికర లాభాన్ని ఆర్జించింది.

Most from this category