News


ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు

Monday 6th January 2020
Markets_main1578305231.png-30708

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ షేర్లు భారీగా నష్టాలను చవిచూసాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2,512 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) నిధుల కేటాయింపును ప్రకటించకపోవచ్చని వార్తలతో పాటు నేడు మార్కెట్లో వెల్లువెత్తిన భారీ అమ్మకాల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఫలితంగా ఇండెక్స్‌లో ఒకదశలో దాదాపు 5శాతం వరకు నష్టపోయి 2,414.60 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 4.50శాతం నష్టంతో 2,413.15 వద్ద స్థిరపడింది. కెనరా బ్యాంక్‌ 6శాతం నష్టపోయింది. పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు నష్టపోయాయి. ఎస్‌బీఐ  4.50శాతం, మహారాష్ట్ర బ్యాంక్‌ 4శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 3.30శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3శాతం, పీఎస్‌బీ బ్యాంక్‌ 2.50శాతం, ఇండియా బ్యాంక్‌ 2శాతం, జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, సెం‍ట్రల్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 1శాతం నష్టపోయాయి. మరోవైపు ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ షేరు మాత్ర 4శాతం లాభంతో ముగిసింది. 



You may be interested

అమ్మకాల షాక్‌ -మార్కెట్లు బేర్‌

Monday 6th January 2020

సెన్సెక్స్‌- 780 పాయింట్లు డౌన్‌  12,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ మూడో రోజూ బ్యాంక్‌ నిఫ్టీ పతనం రూ. 3 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరి పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం దేశీయంగా స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసింది. అమెరికాపై ఇరాన్‌, ఇరాక్‌ కాలుదువ్వితే కఠిన ఆంక్షలతోపాటు, ప్రతిదాడులు చేస్తామంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు షాక్‌ తగిలింది. ఇప్పటికే ఇరానియన్‌ జనరల్‌తోపాటు ఇరాకీ అధికారులు కొంతమంది అమెరికా డ్రోన్‌ దాడిలో మరణించడంతో మధ్యప్రాచ్యంలో

ట్రంప్‌ దెబ్బకు రూ. 3 లక్షల కోట్లు హుష్‌కాకి!

Monday 6th January 2020

సోమవారం మార్కెట్లు బేర్‌ గుప్పిట్లో విలవిల్లాడాయి. ఒక్కరోజులోనే రూ. 3 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఇరాన్‌ మిలటరీ లీడర్‌పై అమెరికా దాడితో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలపై పడింది. మరోవైపు తమ బలగాలు వైదొలగాలని కోరితే ఇరాక్‌పై మునుపెన్నడూలేనంత ఆంక్షలు వేస్తానని యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. దీంతో దేశీయ మార్కెట్లు దాదాపు 2 శాతం పతనమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 సమయానికి

Most from this category