News


అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Thursday 26th December 2019
Markets_main1577341953.png-30452

పరిమితి శ్రేణి మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా గురువారం ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లుకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేడు 2,538.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఈ రంగ షేర్ల అమ్మకాలకు పూనుకోవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1శాతం నష్టపోయి 2,509.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,532.20)తో పోలిస్తే 0.80శాతం నష్టంతో 2,512.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి పీఎస్‌యూ ఇండెక్స్‌లో యూనియన్‌బ్యాంక్‌ షేరు 3.50శాతం నష్టపోయింది. కెనరా బ్యాంక్‌ షేరు 2శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ షేరు 1.50శాతం నష్టపోయింది. ఓరియంటల్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు క్షీణించాయి. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 0.10శాతం నష్టపోయాయి


ఇక ఇదే సమయానికి ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 41,359 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు పతనమై 12,183 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

ఆటో యాన్సిలరీ షేర్ల లాభాల జోరు

Thursday 26th December 2019

ఆటో విడిభాగాల తయారీ కంపెనీలు జూమ్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్లను తాకిన పలు షేర్లు దాదాపు 15 నెలలుగా నేలచూపులకే పరిమితమైన ఆటో విడిభాగాల తయారీ కంపెనీల షేర్లకు ఉన్నట్టుండి భారీ డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో పలు కంపెనీల షేర్లు ఏకంగా 20 శాతం అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. మార్కెట్లు బలహీనంగా కదులుతున్నప్పటికీ ఆటో రంగం ఊపందుకోనున్న అంచనాలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో రాణే

సిటీగ్రూప్‌ డౌన్‌గ్రేడ్‌తో యస్‌ బ్యాంక్‌ డౌన్‌

Thursday 26th December 2019

ఓవైపు యస్‌ బ్యాంక్‌ బాండ్ల రేటింగ్‌ను బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేయగా.. మరోవైపు విదేశీ సంస్థ సిటీ షేరు టార్గెట్‌ ధరలో కోత పెట్టింది. దీంతో యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో యాక్టివిటీ పెరిగింది. గురువారం ట్రేడింగ్‌లో ఉదయం 11కే ఈ కౌంటర్లో 2.29 కోట్ల షేర్లు చేతులు మారినట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి. 11.40 ప్రాంతంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం నష్టంతో రూ. 50.65 వద్ద ట్రేడవుతోంది.

Most from this category