News


పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు క్రాష్‌

Friday 6th December 2019
Markets_main1575613796.png-30090

  • 3.30శాతం నష్టపోయి పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌

అంచనాలకు అనుగుణంగా కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గించకపోవడంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంకింగ్‌ రంగ షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 3.3శాతానికి పైగా నష్టపోయింది. మూడురోజుల పాటు జరిగిన ఆర్‌బీఐ పాలసీ సమావేశం అనంతరం... ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడం, రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశాలుండం‍తో ఈధపా కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ప్రకటించారు. ఫలితంగా నిన్న మార్కెట్‌ ముగిసే సరికి పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. నేడు కూడా అదే ట్రెండ్‌ను కొనసాగడంతో నేటి మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో ఇండెక్స్‌ 3.30శాతం నష్టపోయి 2,490.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,573.85)తో పోలిస్తే 2.85శాతం నష్టంతో 2,500.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా 4శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సెంట్రల్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం క్షీణించాయి. ఇండియన్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం పతనమయ్యాయి. సిండికేట్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 2.50శాతం నష్టపోయాయి. అలహదాబాద్‌ బ్యాంక్‌, జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం పతనయ్యాయి. ఇదే ఏడాది అక్టోబర్‌ 03న జరిగి ఆర్‌బీఐ పాలసీ సమావేశం నుంచి ఈ డిసెంబర్‌ 04న జరిగిన సమావేశం వరకు నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 18శాతం ర్యాలీ చేసింది. ఈ కాల వ్యవధిలో అత్యధికంగా ఎస్‌బీఐ బ్యాంక్‌ షేరు 32.69శాతం వరకు లాభపడింది. 



You may be interested

కంపెనీల ఎబిటా వృద్ధిలో క్షీణత!

Friday 6th December 2019

మూడు రంగాల్లో తీవ్ర ఒత్తిడి క్రెడిట్‌ సూసీ పవర్‌, టెలికం, ఫైనాన్షియల్‌ రంగాల్లో తీవ్రమైన ఒత్తిడి ఉందని క్రెడిట్‌ సూసీ ఇండియా ఈక్విటీ రిసెర్చ్‌ హెడ్‌ ఆశిష​ గుప్తా చెప్పారు. ఇటీవల కాలంలో మొత్తం కార్పొరేట్‌ లాభాలే క్షీణతలో ఉన్నాయన్నారు. ఈ త్రైమాసికంలో కార్పొరేట్‌ ఇండియా సరాసరి ఎబిటా వృద్ధి 6 శాతానికి దిగివచ్చిందన్నారు. దీనికితోడు పలు త్రైమాసికాలుగా స్థిరంగా ఉన్న ఒత్తిడిస్థాయిలు ఈ త్రైమాసికంలో బాగా పెరిగాయన్నారు. ఇంట్రెస్ట్‌కవర్‌ నిష్పత్తి పైమూడు

ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్న పసిడి

Friday 6th December 2019

అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పంద అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో పసిడి ధర శుక్రవారం ఫ్లాట్‌ కదులుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల స్వల‍్ప నష్టంతో 1481 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చలు "సరైన దిశలో పయనిస్తున్నాయి" అని ట్రంప్ తాజా వ్యాఖ్యలు వాణిజ్య ఒప్పందం ఆశలను చిగురించాయి. దీందో రిస్క్‌ అసెట్స్‌లైన ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే డాలర్‌

Most from this category