News


నష్టాల్లో ప్రభుత్వరంగ షేర్లు

Monday 16th September 2019
Markets_main1568619801.png-28402

మార్కెట్‌ పతనంలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు సోమవారం భారీ పతననాన్ని చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌  2,487.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ రంగ షేర్ల తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇంట్రాడేలో 1.65శాతం మేర నష్టపోయి 2,470.65 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.1:20ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,511.80)తో పోలిస్తే 1.25శాతం లాభంతో 2,479.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక సమయానికి ఇండెక్స్‌లో సిండికేట్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 2శాతం నష్టపోయాయి. అలాగే ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. అలాగే జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, అలహదాబాద్‌, కెనరా బ్యాంక్‌, షేర్లు అరశాతం నుంచి 0.10శాతం నష్టపోయాయి. మరోవైపు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు పావు శాతం మేర లాభపడ్డాయి.



You may be interested

ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌కు సెబీ షాక్‌...!

Monday 16th September 2019

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌ చేసేందుకు కొత్తగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయమంటూ ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ను సెబీ ఆదేశించడంతో ఈ కంపెనీ షేర్లు సోమవారం 17.50శాతం నష్టపోయాయి. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.109.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌కు చెందిన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌ చేసేందుకు అనుమతించమంటూ కంపెనీ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ సమర్పించింది. నిబంధనలు విరుద్ధంగా ఉన్న కారణంగా సెబీ ఈక్విటాస్‌

పెట్రో మార్కెటింగ్‌ షేర్లకు చమురు సెగ!

Monday 16th September 2019

7శాతం క్షీణించిన షేర్లు పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. సౌదీ సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల భారీగా పెరగడంతో పాటు డాలరు మారకంలో రూపాయి విలువ పతనం ఇందుకు కారణమవుతున్నాయి. చమురు ధరలు పెరిగితే.. మార్జిన్లు క్షీణించే అవకాశముండటంతో ఇన్వెస్టర్లు పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపతున్నారు. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ),

Most from this category