News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌ జోరు

Tuesday 19th November 2019
Markets_main1574155505.png-29704

ప్రభుత్వరంగ షేర్లు మంగళవారం మార్కెట్‌ ప్రారంభం నుంచి జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా 4.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో మొత్తం 12షేర్లు 2శాతం నుంచి 16శాతం వరకు ర్యాలీ చేశాయి. అత్యధికంగా అత్యధికంగా ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ షేరు 16శాతం లాభపడింది. సిండికేట్‌ బ్యాంక్‌ 15శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 10వాతం, యూనియన్‌ బ్యాంక్‌ 8శాతం, జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌ 7శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 6శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌ 5శాతం పెరిగాయి. అలాగే కెనరా బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 4నుంచి 3శాతం పెరిగాయి. ఎస్‌బీఐ బ్యాంక్‌ షేరు​ 2శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు 2,492.45తో పోలిస్తే 4శాతం లాభంతో 2,592.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
బ్యాంకింగ్‌, ఫార్మా షేర్ల ర్యాలీ కారణంగా ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 60 పాయింట్ల లాభంతో 40,344 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 11,900.60 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

షేర్‌ఖాన్‌ బుల్లిష్‌గా ఉన్న స్టాకులివే!

Tuesday 19th November 2019

‘భారతీ ఎయిర్‌టెల్‌పై టార్గెట్‌ ధరను రూ. 440 కి సవరించాం. వచ్చే రెండేళ్లు భారతీ ఎయిర్‌టెల్‌కు సానుకూలంగా ఉంటాయని అంచనావేస్తున్నాం’ అని షేర్‌ఖాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెమాంగ్‌ జానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌  టెలికాం సెక్టార్‌ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికి, భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం గత కొన్ని సెషన్‌ల నుంచి ర్యాలీ చేస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏజీఆర్‌ బకాయిలు చెల్లించడానికి టెలికాం

ప్రభుత్వ బ్యాంకుల్లో పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు.!

Tuesday 19th November 2019

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులకు పనితీరు ఆధారంగానే ప్రోత్సాహకాలను చెల్లించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 8లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలను అందిస్తున్నారు. ‘‘ప్రదర్శన ఆధారిత ప్రోత్సాహకాలు’’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పలు పీఎస్‌యూ బ్యాంకులు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఉన్నతస్థాయి అధికారులకు ఈ పద్దతిని అమలు చేసే యోచనలో ఉన్నాయి. ప్రస్తుతం

Most from this category