News


పీఎస్‌యూ బ్యాంకుల ర్యాలీ

Friday 27th December 2019
Markets_main1577421634.png-30472

మూడు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు వారాంతాన జోరందుకున్నాయి. జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 ‍ప్రాంతంలో సెన్సెక్స్‌ 202 పాయింట్లు ఎగసి 41,366కు చేరగా.. 53 పాయింట్లు పుంజుకుని 12180 వద్ద ట్రేడవుతోంది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో ఉన్నట్లుండి ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లకు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లు లాభాల బాటలో కదులుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2.6 శాతం లాభపడింది. ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆపరేషన్‌ ట్విస్ట్‌ను మరోసారి అమలు చేయనున్నట్లు ప్రకటించడంతో పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లకు జోష్‌ వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. తద్వారా ఆర్‌బీఐ దీర్ఘకాలిక బాండ్లను కొనుగోలు చేస్తుందని, దీంతో బాండ్ల ఈల్డ్స్‌ సర్దుబాటుకు లోనవుతాయని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇది పీఎస్‌యూ బ్యాంకులకు లబ్దిని చేకూర్చే వీలున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం..

అలహాబాద్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ జోరు
కేంద్ర ప్రభుత్వం నుంచి తాజాగా రూ. రూ. 2153 కోట్ల పెట్టుబడులను అందుకున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో పీఎస్‌యూ రంగ సంస్థ అలహాబాద్‌ బ్యాంక్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8.2 శాతం జంప్‌చేసి రూ. 19.20 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 19.70 వరకూ పెరిగింది. ఇక ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో బాసెల్‌-3 నిబంధనలకు అనుగుణమైన టైర్‌-2 కేపిటల్‌ బాండ్లను జారీ చేసినట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) తెలియజేసింది. తద్వారా రూ. 1500 కోట్లను సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. ఫలితంగా ఈ షేరు సైతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతంపైగా పురోగమించి రూ. 65.4 వద్ద కదులుతోంది.

ఇతర కౌంటర్లు సైతం
పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లో భాగమైన కౌంటర్లలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, స్టేట్‌బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జేఅండ్‌కే బ్యాంక్‌ 4-1.25 శాతం మధ్య లాభపడి ట్రేడవుతున్నాయి. You may be interested

స్పైస్‌జెట్‌- అలుఫ్లోరైడ్‌ లాభాల్లో

Friday 27th December 2019

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లలో ఉదయం సెషన్‌లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో అందుబాటు ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌ కౌంటర్‌తోపాటు, అల్యూమినియం ఫ్లోరైడ్‌ తయారీ కంపెనీ అలుఫ్లోరైడ్‌ చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం.. స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌ గత మూడు రోజులుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న చౌక ధరల విమానయన కంపెనీ స్పైస్‌జెట్‌ షేరు మరోసారి జోరు చూపుతోంది. బీఎస్‌ఈలో 10.45 ప్రాంతంలో ఈ షేరు 3.75 శాతం

రామ్‌కో సిమెంట్స్‌ ప్లాంట్‌కు 5 స్టార్‌ రేటింగ్‌

Friday 27th December 2019

చెన్నై: రామ్‌కో సిమెంట్స్‌ గోవిందపురం, అరియలూర్‌ (తమిళనాడు) కర్మాగారానికి పర్యావరణ, ఆరోగ్య, భద్రతకు సంబంధించి ప్రతిష్టాత్మక  సీఐఐ- ఎస్‌ఆర్‌, ఈహెచ్‌ఎస్‌  ఎక్స్‌లెన్స్‌ అవార్డు లభించింది. ఇందుకు సంబంధించి  ఇటీవల జరిగిన సీఐఐ దక్షిణప్రాంత ఈహెచ్‌ఎస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు, 2019 కార్యక్రమంలో ‘‘5 స్టార్‌ రేటింగ్‌’’ సర్టిఫికేట్‌ను సంస్థ (అరియలూర్‌) వైస్‌ ప్రెసిడెంట్‌-అడ్మిన్‌ ఎస్‌ రామరాజ్‌ స్వీకరించారు. సీఐఐ-ఎస్‌ఆర్‌ ఈహెచ్‌ఎస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌, సుప్రా ఆంకాలజీ ఫౌండర్‌ శ్రీని శ్రీనివాసన్‌ తదితరులు

Most from this category