News


పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు క్రాష్‌

Tuesday 23rd July 2019
Markets_main1563876030.png-27257

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా మిడ్‌సెషన్‌ సమయానికి ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 3,013.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అధిక వెయిటేజీ కలిగిన ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్ల పతనంతో ఇండెక్స్‌ ఒకదశంలో 3.30శాతం క్షీణించి 2,902.65 స్థాయికి పతనమైంది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,001.55)తో పోలిస్తే 3.15శాతం క్షీణించి 2,905.70 వద్ద నష్టపోయింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ వరుసగా ఐదో రోజూ నష్టపోయింది. నేడు 5.50శాతం పతనమైంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 5శాతం, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం క్షీణించాయి. అలాగే ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ షేర్లు 2.50శాతం నష్టపోయాయి. జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌ 1.50శాతం, సిండికేట్‌ బ్యాంక్‌, అలహదబాద్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. ఒక్క ఇండియన్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 3శాతం లాభపడ్డాయి. 



You may be interested

కమోడిటీస్‌: పాజిటివ్‌గా బేస్‌ మెటల్స్‌

Tuesday 23rd July 2019

ఈ నెల చివరిలో జరగనున్న యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌ సమావేశంలో, వడ్డి రేట్ల కోత తక్కువగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో డాలర్‌ గత కొన్ని సెషన్‌ల నుంచి బలపడుతోంది. ఫలితంగా బులియన్‌ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గాయి. దీంతో పాటు మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఒత్తిళ్ల వలన చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా అవసరమైనప్పుడు ప్రతిస్పందిస్తామని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఎజెన్సీ (ఐఈఏ) తెలపడం‍తోపాటు చమురు డిమాండ్‌ భయాల వలన మంగళవారం చమురు ధరలు

అధ్వాన్న పరిస్థితులలో మార్కెట్‌ను విడిచిపెట్టకూడదు: ధీరేంద్ర కుమార్‌

Tuesday 23rd July 2019

‘మిడ్‌ క్యాప్‌లన్నీ చిన్న కంపెనీలు కావు. నిలదొక్కుకునే సామర్ధ్యం ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి మిడ్‌ క్యాప్‌ కంపెనీలను ఎంచుకోవడం మంచిది’ అని వాల్యు రీసెర్చ్‌ సీఈఓ ధీరేంద్ర కుమార్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.... దీర్ఘకాల దృక్పథం మంచిది... మ్యూచువల్‌ ఫండ్‌ సహీ హై ప్రచారం 2017లో ప్రారంభమైనప్పుడు చాలా మంది మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం, ఎస్‌ఐపీ(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లను ప్రారంభించారు. కానీ

Most from this category