News


మహారాష్ట్ర రుణమాఫీతో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లకు దెబ్బ: కోటక్‌

Tuesday 24th December 2019
news_main1577183003.png-30411

మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రైతుల రుణమాఫీ పథకంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లకు దెబ్బపడుతుందని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు ప్రకటనతో మంగళవారం ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.  సెప్టెంబర్‌ 30వ తేదీ నాటి వరకు రూ.2 లక్షల కలిగిన రైతు రుణాల్ని మాఫీ చేస్తున్నట్లు శనివారం ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే అసెంబ్లీలో ప్రకటన చేశారు. మొత్తం రుణాలు మాఫీ చేయడం కుదరదనీ, ప్రభుత్వంపై భారీగా ఒత్తిడి పడుతుందన్న ఆయన రూ. 2 లక్షల వరకే రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని కూడా అందిస్తామని ఆయన తెలిపారు. 

‘‘రుణమాఫీ లాంటి పథకాలు తరచుగా సంభవించడం బ్యాంకుల్లో రుణ సక్రమ చెల్లింపు లోపిస్తుంది. ఆస్తుల నాణ్యత, వృద్ధి దెబ్బతింటుంది. వ్యవసాయ రుణాలలో ప్రభుత్వ బ్యాంకులకు 50 శాతం వాటా ఉంది. కాబట్టి రుణమాఫీ ప్రైవేట్‌ బ్యాంకులపై కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.’’ కోటక్‌ తన నివేదికలో పేర్కోంది. గతంలో జరిగిన రైతు రుణమాఫీ కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రుణ పోర్ట్‌ఫోలియోలో ఆస్తి నాణ్యత మరియు వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. తాజాగా ఆర్‌బీఐ వెల్లడించిన నివేదికల ప్రకారం మహారాష్ట్ర వ్యవసాయ రుణ మెండిబకాయిలు ప్రతీ ఆర్థిక సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయని కోటక్‌ తెలిపింది. అయితే గతంలో ఈ పథకం నుండి ఇప్పటికే లాభం పొందిన ప్రస్తుత రుణగ్రహీతలు ఈ పథకం కింద ఎలా పరిగణింపబడతారు? ఈ రుణగ్రహీతల నుండి రావాల్సిన చెల్లింపులు ఇప్పటికే అధికంగా ఉన్నందున, బ్యాంకుల ఎన్‌పీఎల్‌పై ప్రభావం ఎంతమేర ఉంటుందో అనే అంశాలపై చూడాల్సి ఉంటుందని కోటక్‌ తెలిపింది. 

ఈ నేపథ్యంలో నేడు ప్రభుత్వరంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఇంట్రాడేలో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయి 2,525.45 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 0.81శాతం నష్టపోయి 2,531.90 వద్ద స్థిరపడింది. ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. ఓరియంటల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ యూనియన్‌ బ్యాంక్‌, పీన్‌బీఐ బ్యాంక్‌ ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి.  You may be interested

సెన్సెక్స్‌ 181, నిఫ్టీ 48 పాయింట్ల డౌన్‌

Tuesday 24th December 2019

ఇంట్రాడే కనిష్టం వద్ద ఇండెక్సుల ముగింపు ఐటీ, ఆటో, మీడియా వీక్‌- మెటల్‌,  రియల్టీ అప్‌ ట్రెండ్‌ను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలు కొరవడిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 181 పాయింట్లు క్షీణించి 41,461 వద్ద నిలవగా.. నిఫ్టీ 48 పాయింట్లు నీరసించి 12215 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,703 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,423 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదేవిధంగా నిఫ్టీ

డిష్‌మ్యాన్‌ పతనం- స్టెర్లింగ్‌ టూల్స్‌ జూమ్‌

Tuesday 24th December 2019

కుప్పకూలిన డిష్‌మ్యాన్‌ కార్బొజెన్‌ స్టెర్లింగ్‌ టూల్స్‌ లాభాల హైజంప్‌ ఆదాయపన్ను శాఖ సోదాల నేపథ్యంలో ఫార్మా కంపెనీ డిష్‌మ్యాన్‌ కార్బొజెన్‌ ఎమిక్స్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ కౌంటర్లో వరుసగా మూడో రోజు అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు చైనీస్‌ కంపెనీతో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వార్తలతో ఆటో విడిభాగాల కంపెనీ స్టెర్లింగ్‌ టూల్స్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. వివరాలు చూద్దాం..  డిష్‌మ్యాన్‌ కార్బొజెన్‌ కంపెనీ కార్యాలయాలలో ఈ నెల 19న ఆదాయపన్ను శాఖ

Most from this category