News


దివాలా చట్ట సవరణలు బ్యాంకింగ్‌కు సానుకూలం: మూడీస్‌

Thursday 25th July 2019
Markets_main1564051844.png-27318

 కేంద్ర ప్రభుత్వం దివాలా చట్టంలో చేసిన ఏడు సవరణల వలన ఈ చట్ట ప్రభావం మెరుగుపడుతుందని, అంతేకాకుండా ఈ చర్య ఇండియా బ్యాంకులకు సానుకూలంగా పనిచేస్తుందని మూడీస్‌ ఇన్వెస్ట్‌ర్స్‌ సర్వీసెస్‌ తెలిపింది. ప్రభుత్వం దివాలా చట్టంలో భాగంగా కార్పోరేట్‌  రిజల్యూషన్‌ పక్రియ పూర్తిచేయడానికి 330 రోజుల డెడ్‌లైన్‌ను విధించింది. ఈ సమయంలోనే వివాదాలు, న్యాయ సంబంధ విషయాలను క్లియర్‌ చేసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా దివాలా కంపెనీలోని వాటాదారులపై పరిష్కార ప్రణాళికను రూపొం‍దించాలాని చట్టంలో సవరణలు చేసింది.

 ఐబీసీ కిందకు వచ్చిన కంపెనీల రిజల్యూషన్‌ పక్రియ 270 రోజులలో పూర్తి కావాలి కానీ ఈ దివాలా కంపెనీలకు చెందిన భాగస్వాములు అత్యున్నత కోర్టులలో అప్పీలు చేస్తుండడంతో అధిక సమయం పడుతుందని ఈ రేటింగ్‌ సంస్థ తెలిపింది.  ఈ సవరణలు రిజల్యూషన్‌ ప్రక్రియలో వచ్చే ఆదాయాల పంపిణీపై రుణదాతల కమిటీకి స్పష్టమైన అధికారాలనిచ్చాయి. ఎస్సార్ స్టీల్ విషయంలో ఇటీవల వచ్చిన తీర్పులో రుణదాతల కమిటీ నిర్ణయాన్ని కోర్టు రద్దు చేసింది. రిజల్యూషన్‌ ఆదాయాన్ని అన్ని హక్కుదారుల మధ్య సమానంగా పంపిణీ చేయాలని పేర్కొంది. ఇందులో సురక్షితమైన రుణదాతలను అసురక్షిత, కార్యాచరణ రుణదాతల మాదిరిగానే పరిగణించడం గమనార్హం. 

మూడవ సవరణ..రియల్‌ ఎస్టేట్‌
 ఈ సవరణలలోని మూడవ సవరణ ప్రకారం రుణదాతల కమిటీలో హొం బయ్యర్‌లు ఉంటే రుణ దాతల కమిటీ, రిజల్యూషన్‌ ప్రక్రియను అంగీకరించడానికి  ఈ కమీటీలోని హోం బయ్యర్‌లలో 50 శాతం మించి అమోదం ఉంటే సరిపోతుంది.  ‘ఈ సవరణ భారతీయ బ్యాంకులకు పాజిటివ్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే  రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పరిష్కారంలో  ఈ సవరణ ఎంతో దోహదపడుతుంది. ఐబిసి క్రింద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులోని హోమ్‌బయ్యర్‌లను సురక్షిత రుణదాతలతో సమానంగా పరిగణించేవారు. కనుక రిజల్యూషన్‌ పక్రియను ఆమెదించడానికి రుణ దాతల కమిటీ ముందు వారి అనుమతి తప్పకుండా అవసరమయ్యేది’ అని మూడీస్ తెలిపింది. ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో హోమ్‌బయ్యర్‌లు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందు వలన ఆ బాధిత హోమ్‌బయ్యర్‌లందరి ఆమోదం పొందడం  కఠినతరం అయ్యేది. ‘ ఈ సవరణ వలన ప్రతిపాదిత రిజల్యూషన్‌ పక్రియను ఆమోదించటానికి హాజరైన వారిలో ఎక్కువమంది హోంబయ్యర్‌ల ఆమోదం ఉంటే సరిపోతుంది’ అని మూడీస్ వివరించింది. You may be interested

ధర, ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రియల్ మీ సీ2

Thursday 25th July 2019

10 లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి! ధర, ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రియల్ మీ సీ2 స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ రియల్‌మీ సీ2 మోడల్‌ అమ్మకాలు 10 లక్షల యూనిట్లను దాటాయి. ఏప్రిల్‌లో భారత్‌లో విడుదలైన ఈ ఫోన్‌ అతి తక్కువ కాలంలో రికార్డు స్థాయి విక్రయాలు సాధించడం విశేషం. ధరల శ్రేణి రూ.5,999-7,999 ఉంది. బడ్జెట్‌ ధరలో పెద్ద తెరతో ఇది తయారైంది. 6.1 అంగుళాల హెచ్‌డీ, డ్యూడ్రాప్‌ డిస్‌ప్లే, గొరిల్లా

ఆరంభలాభాలు ఆవిరి

Thursday 25th July 2019

  ఆరోరోజూ ఆగని సూచీల పతనం ఆరంభ లాభాలు ఆవిరి కావడంతో మార్కెట్‌ ఆరోరోజూ నష్టాలతో ముగిసింది.  సెన్సెక్స్‌ 16 పాయింట్లు నష్టపోయి 37831 వద్ద, నిఫ్టీ 9.50 పాయింట్లు క్షీణించి 11261 వద్ద స్థిరపడ్డాయి. నేడు జూలై డెరివేటివ్‌ సిరీస్‌ గడువు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్ల స్క్వేరింగ్‌అప్‌ లావాదేవీల కారణంగా స్టాక్‌ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అలాగే నేటి జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశ నిర్ణయాలు కోసం మార్కెట్‌ వర్గాల ఎదురుచూపులు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌

Most from this category