News


ప్రమోటర్లు వాటా పెంచుకున్న చిన్న షేర్లు!

Tuesday 21st January 2020
Markets_main1579583718.png-31066

జాబితాలో రేమండ్‌ లిమిటెడ్‌
గ్రీవ్స్‌ కాటన్‌, శాస్కన్‌ టెక్నాలజీస్‌
వోల్టాం‍ప్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, బేయర్‌ క్రాప్‌సైన్స్‌

మార్కెట్లు అంతగా దృష్టిపెట్టని కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలలో గత కొంత కాలంగా ప్రమోటర్లు వాటాలు పెంచుకుంటూ వస్తున్నారు. ఈ జాబితాలో డైవర్సిఫైడ్‌ దిగ్గజం రేమండ్‌ లిమిటెడ్‌, ఐటీ సేవల శాస్కన్‌ టెక్నాలజీస్‌, విద్యుత్‌ రంగ కంపెనీ వోల్టాం‍ప్ ట్రాన్స్‌ఫార్మర్‌, అగ్రికెమికల్స్‌ దిగ్గజం బేయర్‌ క్రాప్‌సైన్స్‌, ఇంజిన్ల తయారీ కంపెనీ గ్రీవ్స్‌ కాటన్‌ చోటు సాధించాయి. సాధారణంగా ఏదైనా కంపెనీలో ప్రమోటర్లు వాటా పెంచుకుంటే ఆ కంపెనీ పనితీరుతోపాటు.. షేరు విలువ సైతం జోరందుకునే అవకాశముంటుంది. నిజానికి కంపెనీ బిజినెస్‌ ఫండమెంటల్స్‌లో వచ్చే కీలక మార్పులు, వృద్ధి అవకాశాలు తదితరాలు ప్రమోటర్లకే ముందుగా తెలుస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఏదైనా కంపెనీలో ప్రమోటర్ల వాటా పెరిగితే.. ఆ కంపెనీ పనితీరు మెరుగుపడనున్న అంచనాలు బలపడతాయని తెలియజేశారు. ఇలా ప్రమోటర్లు వాటా పెంచుకున్న నాణ్యమైన కంపెనీలలో చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపవచ్చని సూచిస్తున్నారు. అయితే ఆయా కంపెనీల యాజమాన్యం, నిర్వహణ సామర్థ్యం, బిజినెస్‌లకున్న అవకాశాలు వంటి పలు అంశాలను ఇన్వె‍స్ట్‌ చేసేముందు పరిశీలించవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రమోటర్లు వాటా పెంచుకున్న తదుపరి సైతం కంపెనీల బిజినెస్‌లు నీరసించిన సందర్భాలున్నట్లు ప్రస్తావిస్తున్నారు. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) క్యూ2తో పోలిస్తే క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)కల్లా ప్రమోటర్ల వాటా పెరిగిన ఓ ఐదు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల వివరాలు చూద్దాం..

రేమండ్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)తో పోలిస్తే.. డిసెంబర్‌కల్లా టెక్స్‌టైల్‌ దిగ్గజం రేమండ్‌ లిమిటెడ్‌లో ప్రమోటర్ల వాటా 2.8 శాతం పెరిగింది. 44 శాతం నుంచి 46.8 శాతానికి ఎగసింది. వాటాదారులకు విలువ చేకూర్చే బాటలో లైఫ్‌స్టైల్‌ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు గతేడాదిలో రేమండ్‌ బోర్డు ఆమోదముద్ర వేసింది. తద్వారా సుప్రసిద్ధ దుస్తుల బ్రాండ్లు లైఫ్‌స్టైల్‌ బిజినెస్‌లో భాగంకానున్నాయి. దీనికితోడు థానేలోగల భూమిని కొంతమేర విక్రయించడంతోపాటు.. హౌసింగ్‌ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసే ప్రణాళికలు సైతం ప్రకటించింది. దీంతో రానున్న కాలంలో రేమండ్‌కు రియల్టీ విభాగం ద్వారా అదనపు ఆదాయం సమకూరగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

బేయర్‌ క్రాప్‌సైన్సెస్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)తో పోలిస్తే.. డిసెంబర్‌కల్లా టెక్స్‌టైల్‌ దిగ్గజం బేయర్‌ క్రాప్‌సైన్సెస్‌లో ప్రమోటర్ల వాటా 2.7 శాతం పెరిగింది. 68.7 శాతం నుంచి 71.4 శాతానికి ఎగసింది. అగ్రికెమికల్స్‌, ఫార్మా ప్రొడక్టుల ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో నామమాత్ర వృద్ధినే చూపింది. అయితే యాజమాన్యం వ్యయ నియంత్రణ, మార్కెటింగ్‌ వ్యూహాల ద్వారా కంపెనీని పట్టాలెక్కించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు వీలుగా మోన్‌శాంటో టీమ్‌ను విలీనం చేసుకోవడం ద్వారా పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతోంది. అమ్మకాలు పెంచుకునేందుకు పంపిణీదారులు, రైతులకు ‍ప్రోత్సాహకాలు ఇస్తోంది.

శాస్కన్‌ టెక్నాలజీస్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)తో పోలిస్తే.. డిసెంబర్‌కల్లా ఐటీ సేవల కంపెనీ శాస్కన్‌ టెక్నాలజీస్‌లో ప్రమోటర్ల వాటా 2.65 శాతం పెరిగింది. 42.4 శాతం నుంచి 45.1 శాతానికి ఎగసింది. సాఫ్ట్‌వేర్‌ సేవలు, ప్రొడక్టుల ఈ కంపెనీ డిసెంబర్లో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను పూర్తిచేసింది. షేరుకి రూ. 825 ధర మించకుండా చేపట్టిన బైబ్యాక్‌లో భాగంగా ప్రమోటర్లు వాటా విక్రయించకపోవడం గమనార్హం! మరోవైపు కంపెనీ యాజమాన్యం.. ఇకపై ఆదాయం పుంజుకోగలదన్న అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించింది. అయితే సెప్టెంబర్‌ త్రైమాసికం(క్యూ2)లో ఆదాయం క్యూ1తో పోలిస్తే 9 శాతం నీరసించింది. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి పటిష్ట ఫలితాలు సాధించగలమన్న ధీమా యాజమాన్యం వ్యక్తం చేస్తోంది.

వోల్టాంప్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)తో పోలిస్తే.. డిసెంబర్‌కల్లా విద్యుత్‌ రంగ కంపెనీ వోల్టాంప్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌లో ప్రమోటర్ల వాటా 1.73 శాతం పెరిగింది. 48.27 శాతం నుంచి 50 శాతానికి ఎగసింది. ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ ఈ కంపెనీ ఆర్డర్‌ బుక్‌ ఇటీవల 60 శాతం బలపడింది. అయితే క్యూ2లో ఆదాయం 3 శాతమే పుంజుకుంది. కాగా.. రానున్న రెండేళ్లలో ఆదాయం 20 శాతం చొప్పున పెరిగే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో నిర్వహణ లాభం మెరుగుపడగలదని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇబిటా మార్జిన్లు దాదాపు 11 శాతంగా నమోదయ్యాయి.  

గ్రీవ్స్‌ కాటన్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)తో పోలిస్తే.. డిసెంబర్‌కల్లా ఇంజిన్ల తయారీ కంపెనీ గ్రీవ్స్‌ కాటన్‌ లిమిటెడ్‌లో ప్రమోటర్ల వాటా 2.9 శాతం పెరిగింది. 51.9 శాతం నుంచి 54.8 శాతానికి ఎగసింది. ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్‌ విభాగంలో యాంపియర్‌ కంపెనీలో 100 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ ఏడాది క్యూ2లో కంపెనీ పనితీరు మందగించినప్పటికీ ప్రమోటర్లు వాటాను పెంచుకోవడం గమనార్హం. యాంపియర్‌ను సొంతం చేసుకోవడం ద్వారా అమ్మకాలు పుంజుకోనున్నట్లు అంచనా వేస్తోంది.You may be interested

2వారాల గరిష్టానికి పసిడి

Tuesday 21st January 2020

అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్ల ధర మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో  2వారాల గరిష్టాన్ని అందుకుంది. మధ్య ఆసియాలో మరోసారి నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్‌ అవుట్‌లుక్‌ కేటాయింపుతో అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 8డాలర్లు లాభపడి 1,568.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ధర పసిడికి 2వారాల గరిష్టస్థాయి కావడం విశేషం.  కొద్ది రోజులుగా నిశబ్దంగా ఉన్న

ఐఎంఎఫ్‌ నెగిటివ్‌ అవుట్‌లుక్‌ : నష్టాలతో మొదలైన మార్కెట్‌

Tuesday 21st January 2020

12200 దిగువున మొదలైన నిఫ్టీ భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించడంతో దేశీయ మార్కెట్‌ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 42 పాయింట్లు నష్టంతో 41,487 వద్ద మెదలైంది. నిఫ్టీ 29 పాయింట్ల క్షీణతతో 12200 దిగువున 12,195 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ప్రారంభం కావడం గమనార్హం. భారత్‌లో గ్రామీణ డిమాండ్‌ వృద్ధి పడిపోయిందని, బ్యాంకింగ్‌ రుణ వృద్ధి

Most from this category