ఈ కంపెనీల ప్రమోటర్ల వాటాల్లో మార్పులు
By Sakshi

మార్కెట్లు దాదాపు గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ సమయంలో ఏ స్టాక్‌ను కొనుగోలు చేయాలన్న మీమాంసతో ఇన్వెస్టర్లున్నారు. మార్కెట్లో ర్యాలీ చేసే స్టాక్స్ మీ పోర్ట్‌ఫోలియోలో ఉండాలని భావిస్తున్నారా..? అయితే, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందుగా.. కంపెనీల ప్రమోటర్ల వాటా గణాంకాలపై ఓ సారి కన్నేయాల్సిందే. ఈ గణాంకాలు స్టాక్ ఎంపికలో మీకు సాయపడొచ్చు. జూన్ త్రైమాసికం నుంచి సెప్టెంబర్ త్రైమాసికం నాటికి బీఎస్ఈ500 సూచీలోని 54 కంపెనీల్లో ప్రమోటర్ల వాటా పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రమోటర్లు వాటాలు పెంచుకున్నవి, తగ్గించుకున్న వాటిపై తప్పకుండా దృష్టి పెట్టాలి. ప్రమోటర్లు వాటా పెంచుకుంటే సానుకూల సంకేతంగాను, అదే తగ్గించుకోవడాన్ని ప్రతికూల సంకేతంగానూ సాధారణంగా చూస్తుంటారు. అయితే కేవలం ఈ ఒక్క అంశమే కాకుండా, విడిగా ఒక్కో కంపెనీకి సంబంధించి మరెన్నో గణాంకాల ఆధారంగానే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవడం సరైనదిగా నిపుణుల సూచన. ప్రమోటర్లు వాటాలు పెంచుకున్న కంపెనీల్లో 70 శాతం స్టాక్స్ గత ఏడాది కాలంలో ప్రతికూల రాబడులే ఇచ్చాయి. అంటే స్టాక్స్ పడిపోవడం వల్ల అవి వాస్తవ విలువ కంటే తక్కువకు లభిస్తున్నాయని తెలుస్తోంది. ‘‘ప్రమోటర్లు వాటాలు పెంచుకున్న అన్ని స్టాక్స్ కూడా తక్కువ వ్యాల్యూషన్లో ఉన్నాయని కాదు. రిలయన్స్ స్టాక్ ఏడాది గరిష్టాల్లో ఉన్నప్పటికీ ప్రమోటర్లు వాటాలు పెంచుకోవడం మంచి సంకేతం. భిన్నమైన వెర్టికల్స్ ద్వారా భవిష్యత్తులో మంచి పనితీరు చూపించనుందని అర్థం. నిట్ టెక్నాలజీస్, థైరోకేర్, ఆల్కెమ్ ల్యాబ్స్, అతుల్ లిమిటెడ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది’’ అని ట్రేడింగ్‌బుల్స్ సీనియర్ అనలిస్ట్ సంతోష్మీన పేర్కొన్నారు. సన్ ఫార్మా, పర్సిస్టెంట్ కంపెనీల్లో ప్రమోటర్లు వాటాలు కొనుగోలు చేయడం అన్నది వాటి వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉండడం వల్లేనన్నారు. అదే మైండ్‌ట్రీ, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌లో ప్రమోటర్ల కొనుగోలు, కంపెనీని సొంతం చేసుకోవడం, పునర్నిర్మాణ అంశాల్లో భాగంగా పేర్కొన్నారు. వాటాలు పెంచుకున్నవి వాటాలు తగ్గించుకున్నవి
వొడాఫోన్, ఇండియాబుల్స్ హౌసింగ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, శంకర బిల్డింగ్, జాగరణ్ ప్రకాశన్, కార్పొరేషన్ బ్యాంకు, లక్ష్మీ మెషిన్ వర్క్స్, నవభారత్ వెంచర్స్, సైయంట్, జిందాల్ స్టెయిన్లెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, క్యాడిలా హెల్త్‌కేర్, క్వె్స్కార్ప్, మేఘమణి ఆర్గానిక్స్, ఎస్‌హెచ్ కేల్కర్, లా ఒపాలా ఆర్జీ, సన్‌ఫార్మా, షాపర్స్ స్టాప్, మహారాష్ట్ర సీమ్‌లెస్, టాటాపవర్, ఆర్‌నామ్, ట్రెంట్, ఆర్ఐఎల్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, దీపక్నైట్రేట్, అతుల్, గెలాక్సీ సర్ఫాక్టంట్స్, అదానీ పోర్ట్స్, జీఎంఆర్ ఇన్ఫ్రా, చంబల్ ఫర్టిలైజర్స్, పర్సిస్టెంట్సిస్టమ్స్, జిందాల్ సా, విప్రో, ఆల్కెమ్, జేఎం ఫైనాన్షియల్, ఎంఆర్ఎఫ్, థైరోకేర్, ఇన్ఫోసిస్, శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్ట్, అడ్వాన్స్డ్ ఎంజైమ్.
రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్క్యాపిటల్, రిలయన్స్ పవర్, కాఫీడే, లక్ష్మీవిలాస్ బ్యాంకు, హెచ్ఈజీ, డిష్ టీవీ, ఎవరెడీ ఇండస్ట్రీస్, స్టెరిలైట్ టెక్నాలజీస్, యస్‌బ్యాంకు, పీసీ జ్యుయలర్, ఎడెల్వీజ్ ఫైనాన్షియల్, జీఎంటర్టైన్మెంట్, వోకార్డ్, ఫ్యూచర్ కన్జ్యూమర్, పీఎన్బీ హౌసింగ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఎన్బీసీసీ ఇండియా, బజాజ్ కన్జ్యూమర్, జెన్సార్ టెక్నాలజీస్.
You may be interested
బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత భద్రత!
Wednesday 20th November 2019బీమా రూ.5 లక్షలకు పెంచే అవకాశం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చట్టం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలు ఆర్థిక శాఖ ముందు పలు ప్రతిపాదనలు న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్... ఎక్కువ మందికి సురక్షిత పెట్టుబడి సాధనం. త్వరలో ఇది మరింత భద్రంగా మారనుంది. ప్రస్తుతం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) పరిధిలో ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష బీమాను బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో ఏదైనా బ్యాంకు సంక్షోభం పాలై
‘టాటా ఫోకస్డ్ ఈక్విటీ’లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Tuesday 19th November 2019టాటా మ్యూచువల్ ఫండ్ (ఏఎంసీ) టాటా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ పేరుతో నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 29న ముగియనుంది. ఆసక్తిగల ఇన్వెస్టర్లు గడువులోపు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, ముందుగా నిపుణులు, ఫైనాన్షియల్ ప్లానర్ల అభిప్రాయాలను తెలుసుకోవడం ఉపయోగకరం. యాక్టివ్‌గా నిర్వహించే ఏ ఈక్విటీ