News


తగ్గిన ప్రమోటర్ల తనఖా బంధం..

Friday 16th August 2019
Markets_main1565978670.png-27817

ఇన్వెస్టర్లను సంతోషానికి గురి చేసే సమాచారం ఏమిటంటే... బీఎస్‌ఈ 500 కంపెనీల్లో ప్రమోటర్ల తనఖా షేర్ల పరిమాణం జూన్‌ క్వార్టర్‌లో తగ్గడం. తనఖాలో ఉన్న ప్రమోటర్ల వాటాల పరిమాణం జనవరి-మార్చి క్వార్టర్‌లో 2.83 శాతంగా ఉండగా, ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 2.47 శాతానికి క్షీణించిందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఓ నివేదికలో వెల్లడించింది. తనఖాలో ఉన్న ప్రమోటర్ల మొత్తం వాటాల విలువ 1.73 లక్షల కోట్లు. 

 

ప్రమోటర్లు తమ వాటాలను రుణాల కోసం తనఖాగా ఉంచడం అన్నది మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే, కంపెనీలు రుణాలను చెల్లించడంలో విఫలమవుతున్న కేసులు పెరిగిపోతుండడం, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నిధుల లభ్యతకు కటకట పరిస్థితుల్లో ప్రమోటర్ల వాటాలు తనఖా ఉన్న కంపెనీల విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలన్నది నిపుణుల అభిప్రాయం. ప్రమోటర్ల వాటాల తనఖాను ఆ కంపెనీ ప్రమోటర్‌ లేదా కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని భావించడం అన్ని సందర్భాల్లో సరికాదని, బ్యాంకులు ప్రమోటర్ల షేర్ల రూపంలో అదనపు హామీ కోరుతుంటాయని కోటక్‌ తెలిపింది. అయితే, తనఖాలో ఉంచిన షేర్ల పరిమాణం తగ్గిందంటే, కంపెనీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయన్న దానికి సూచికగా జియోజిత్‌ ఫైనాన్షియల్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. 

 

జూన్‌ త్రైమాసికంలో 30 కంపెనీల ‍ప్రమోటర్లు తనఖాలో ఉంచిన వాటాలను కొంతమేర విడిపించుకున్నారు. వీటిల్లో క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, హిమత్‌సింగా సీడ్‌, అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ కంపెనీలలో మాత్రం ప్రమోటర్ల వాటాలు తనఖా నుంచి పూర్తిగా బయటపడినట్టు ‍ప్రైమ్‌ డేటాబేస్‌ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అలాగే, ఇండియా సిమెంట్స్‌, సద్బావ్‌ ఇంజనీరింగ్‌, జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌, అదానీ పోర్ట్స్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, డీబీ కార్ప్‌, అపోలో హాస్పిటల్స్‌లో ప్రమోటర్ల తనఖా వాటాల శాతం మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్‌ క్వార్టర్‌లో తగ్గింది. 

 

మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్‌ క్వార్టర్‌లో ఇలా తనఖా వాటాలు తగ్గిన కంపెనీల్లో... కల్పతరు పవర్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌, స్వాన్‌ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా, బజాజ్‌ కన్జ్యూమర్‌, శిల్పా మెడికేర్‌, అజంతా ఫార్మా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌, మనప్పురం ఫైనాన్స్‌, ఎన్‌సీసీ, అతుల్‌, అదానీ పవర్‌, ఇమామీ, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు ఉన్నాయి. తనఖా వాటాలు తగ్గడంతోపాటు, ప్రమోటర్ల నుంచి కంపెనీలోకి తాజా పెట్టుబడులు వస్తే విశ్వాసాన్ని పెంచుతుందని, ఆ కంపెనీ పట్ల ప్రమోటర్ల అంకిత భావాన్ని తెలియజేస్తుందని క్యాపిటల్‌ ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రొమేష్‌ తివారీ తెలిపారు.You may be interested

ఈ కంపెనీల లాభం రెట్టింపయ్యెను

Friday 16th August 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికానికి సంబంధించి ఫలితాల సీజన్‌ దాదాపు ముగిసినట్టే. ఏవో కొన్ని కంపెనీలను మినహాయిస్తే చాలా కంపెనీలు ఇప్పటికే ఫలితాలను ప్రకటించేశాయి. ఎఫ్‌ఎంసీజీ, పెయింట్స్‌, కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు అంచనాలకు మించి మెరుగైన ఫలితాలను ప్రకటించాయి. ఆటో, ఆటో యాన్సిలరీ, మధ్యస్థాయి ఐటీ కంపెనీల ఫలితాల్లో మాత్రం వృద్ధి అంచనాలు మిస్సయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 20 కంపెనీల లాభం పెరగ్గా, ఇతర కంపెనీల లాభం

పరిస్థితి బాగుంటే సర్‌ఛార్జ్‌ ఓకే

Friday 16th August 2019

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చీప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రసూన్‌ గాజ్రి అంతర్జాతీయంగా, దేశియంగా స్థూల ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో పాటు బలహీనమైన కార్పోరేట్‌ ఆదాయాలు, కొనసాగుతున్న ఆర్థిక మందగమనం వలన దేశియ మార్కెట్లలో భారీగా అనిశ్చితి నెలకొని ఉందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చీప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రసూన్‌ గాజ్రి అన్నారు. ‘మన ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మందగమనం లేకపోయి ఉంటే ఎఫ్‌పీఐ(ఫారిన్‌ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు)లపై విధించే ఎటువంటి పన్ను అయినా కూడా మార్కెట్‌ను నష్టపరిచేది కాదు’ అని

Most from this category