News


ప్రమోటర్ల వాటాల తనఖాల్లో భారీ మార్పులు

Tuesday 30th July 2019
Markets_main1564509859.png-27421

వాటాలను తనఖా ఉంచి రుణాలు తీసుకుంటే ఏం జరుగుతుంది...? మార్కెట్‌ పతనాల్లో పెద్ద ఉపద్రవమే వచ్చి పడుతుంది. తాజా మార్కెట్‌ క్రాష్‌లో ఇది ఇన్వెస్టర్లతోపాటు ప్రమోటర్లకూ అవగతం అవుతూనే ఉంది. షేర్లను తనఖా ఉంచి రుణాలు తీసుకున్న వారు, హామీగా ఉంచిన షేర్ల ధరల విలువ పడిపోతుంటే... తిరిగి ఆ మేర అదనపు విలువకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే రుణమిచ్చిన సంస్థలు వాటాలను నిలువునా మార్కెట్లో విక్రయించేస్తాయి. దీంతో ఆయా స్టాక్స్‌ మరింత పతనాన్ని చవిచూడాల్సి వస్తుంది. 

 

ప్రమోటర్లు తమ కంపెనీల్లో తమకున్న వాటాల నుంచి కొంత మేర రుణాలకు తనఖాగా ఉంచడం ప్రతీ కేసులోనూ చెడ్డది అని కళ్లు మూసుకుని తేల్చేయడం కూడా సరికాదు. తమ వాటాలు తనఖాలో ఉంచినప్పటికీ... ఇప్పటి వరకు తప్పటడుగులు పడకుండా చూసుకున్న ప్రమోటర్లు కూడా ఎందరో ఉన్నారు. అయితే, ఆర్థిక రంగం మందగమనం పాలవుతున్న సమయాల్లో అధిక శాతం వాటాలను తనఖా ఉంచిన ప్రమోటర్ల కంపెనీలకు రిస్క్‌ ఎదరవుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఆయా షేర్లు మరింత క్షీణిస్తే వారి వాటాలు ఓపెన్‌ మార్కెట్లో చేతులు మారతాయి. ప్రమోటర్ల వాటా నామమాత్రానికి పడిపోతుంది. జూన్‌ త్రైమాసికంలో ప్రమోటర్ల తనఖా వాటాలు భారీగా పెరిగిన, భారీగా తరిగిన టాప్‌ 10 కంపెనీల వివరాలను గమనిస్తే...

 

జూన్‌ త్రైమాసికం నాటికి... మెక్లాయిడ్‌ రస్సెల్‌లో ప్రమోటర్ల తనఖా వాటాలు 98.40 శాతానికి చేరాయి. సరిగ్గా ఏడాది క్రితం జూన్‌ త్రైమాసికం నాటికి ఉన్న 37.96 శాతం నుంచి చూస్తే ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇమామీలో 46.81 శాతం, బిర్లా సాఫ్ట్‌లో 69 శాతం, ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో 88.5 శాతం, ఎంటీ ఎడ్యుకేర్‌లో 54.69 శాతం, భారత్‌ వైర్‌లో 70.22 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో 26.33 శాతం, ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌లో 14.28 శాతం, కెశోరామ్‌ ఇండస్ట్రీస్‌లో 44.82 శాతం, జిందాల్‌ స్టీల్‌లో 64.85 శాతం, జేకే టైర్‌లో 35.39 శాతం, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌లో 69.30 శాతం మేర వాటాలు తనఖాలో ఉన్నాయి. అంతక్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ఈ కంపెనీల ప్రమోటర్ల తనఖా వాటాలు గణనీయంగా పెరిగాయి. 

 

ఇక క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికం నుంచి ఈ ఏడాది జూన్‌ నాటికి ప్రమోటర్ల తనఖా వాటాల్లో రెండంకెల మేర తగ్గిన కంపెనీల్లో సీజీ వపర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ను ప్రధానంగా చెప్పుకోవాలి. గతేడాది జూన్‌ నాటికి ప్రమోటర్ల వాటాలు 99.99 శాతం తనఖాలో ఉండగా, వీటిని మొత్తం విడిపించుకున్నారు. ఇమామీ పేపర్‌లో 68.35 శాతం నుంచి 35.77 శాతానికి తనఖా తగ్గింది. హిమత్సింగ్‌ సీడేలోనూ ప్రమోటర్లు పూర్తిగా తనఖాల నుంచి బయటపడ్డారు. ఇండియా సిమెంట్స్‌లో 45.7 శాతం నుంచి 27 శాతానికి, రాంకీ ఇన్‌ఫ్రాలో 47.41 శాతం నుంచి 29.85 శాతానికి, సద్బావ్‌ ఇంజనీరింగ్లో 49 శాతం నుంచి 36 శాతానికి, అడ్వాన్స్‌ ఎంజైమ్‌లో 12.5 శాతం నుంచి సున్నా శాతానికి తనఖా వాటాలు తగ్గాయి. గతి, అదానీ పోర్ట్స్‌, జీఎన్‌ఏ యాక్సిల్స్‌, డీబీ కార్ప్‌, అపోలో హాస్పిటల్స్‌లోనూ ప్రమోటర్లు తనఖా వాటాలను కొంత మేర విడిపించుకున్నారు. You may be interested

కాఫీ డే సిద్ధార్థ మృతదేహం లభ్యం

Wednesday 31st July 2019

ప్రముఖ కాపీ అవుట్‌లెట్స్‌ ఛైన్‌ వ్యవస్థాపకుడు కేజీ సిద్ధార్థ మృతదేహం బుధవారం తెల్లవారుజామున నేతాృవళి నదిలో లభ్యమయ్యింది. సోమవారం సాయంత్రం అదృశ్యమైన సిద్ధార్థ ఏమయ్యారోనన్న అనుమానాలకు దీంతో తెరపడింది. వి జి సిద్ధార్థ మృతదేహాన్ని హోయిజ్ బజార్‌ సముద్ర తీరంలో బుధవారం ఉదయం 6.30 గంటల సమయానికి మత్స్యకారులు గుర్తించారు. చివరిసారిగా సిద్ధార్థను చూసిన ప్రాంతం నుంచి ఈ తీరం ఒక కిలో మీటర్‌ దూరంలోనే ఉండడం గమనర్హం. పోస్ట్‌మార్టం నిర్వహించడానికి

తొందరొద్దు.. చేతిలో కొంత నగదు ఉంచుకోండి: దీపక్‌ షెనాయ్‌

Tuesday 30th July 2019

మార్కెట్లకు ఇదే బోటమ్‌ (కనిష్టం)గా భావించి కొనుగోళ్లకు దిగొద్దని క్యాపిటల్‌ మైండ్‌ వ్యవస్థాపకుడు దీపక్‌ షెనాయ్‌ సూచించారు. రానున్న నెలల్లో ఇన్వెస్టర్లకు బోలెడన్ని పెట్టుబడుల అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    చేతిలో నగదు ఉంచుకునేందుకు వెనుకాడవద్దని, అలాగే, పోర్ట్‌ఫోలియోలో కొన్ని స్టాక్స్‌ను విక్రయించి నగదు నిల్వలతో ఉండడం మంచిదేనని దీపక్‌ షెనాయ్‌ సూచించారు. ఆందోళనతో జరుగుతున్న

Most from this category