News


ప్రమోటర్ల వాటాల తాకట్టుతో చిక్కులే!

Thursday 14th February 2019
Markets_main1550085744.png-24181

ప్రమోటర్లు కంపెనీల్లో తమకున్న వాటాలను తాకట్టు పెట్టే ధోరణి మన మార్కెట్లో క్రమంగా విస్తరిస్తోంది. ప్రమోటర్లు వ్యాపార అవసరాల కోసం తీసుకునే రుణాలకు తమ షేర్లను తనఖాగా ఉంచడం ఒక కోణం అయితే... తమ వ్యక్తిగత వ్యాపారాల కోసం ఒక కంపెనీలో వాటాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం మరో కోణం. అయితే, ఇక్కడ ప్రమోటర్ల సామర్థ్యం, మార్కెట్‌ పరిస్థితులు, భవిష్యత్తులో వారి వ్యాపారాలు ఎదుర్కొనే సమస్యలు ఇవన్నీ కూడా వారి తాకట్టు తలరాతను మారుస్తాయి. చివరికి ఇటీవల అనిల్‌ అంబానీ గ్రూపు షేర్ల భారీ పతనం తరహా సందర్భాలను గుర్తుకు తేవచ్చు. 

 

అయితే, ప్రమోటర్ల వాటాలు తనఖాలో ఉన్నాయంటే దాన్ని వెంటనే ప్రతికూలంగా తీసుకోవడం కూడా సరికాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అన్ని అంశాలను చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నది వారి ఉచిత సలహా. ఇటీవలే ఎస్సెల్‌ గ్రూపు షేర్ల పతనాన్ని చూసే ఉంటారు. ఎస్సెల్‌ గ్రూపు ప్రమోటర్లు సైతం ప్రధాన కంపెనీలైన జీల్‌, డిష్‌ టీవీ తదితర కంపెనీల్లో అధిక శాతం షేర్లను రుణాల కోసం తనఖాలో ఉంచారు. తీసుకున్న రుణాలతో చేసిన ఇన్‌ఫ్రా వ్యాపారం బెడిసి కొట్టడంతో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈ షేర్లు భారీ పతనాన్ని చూవిచూశాయి. ఇదే అంశంతో అపోలో హాస్పిటల్స్‌ షేరు సైతం రెండు రోజుల క్రితం అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నది. నిజానికి ప్రమోటర్లు తమ షేర్లను తనఖాలో ఉంచడం ద్వారా చాలా సులభంగా రుణాలు పొందగలరు. ఈ సౌలభ్యమే వారిని తాకట్టుకు దారిచూపుతోంది. రుణాల కోసం అదనపు హామీగాను షేర్లను ఉంచుతుంటారు. అలాగే, తమ వాటాలను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలతో తమ కంపెనీల వాటాలనే అదనంగా కొనుగోలు చేయడం ద్వారా వాటాను పెంచుకుంటారు. ప్రమోటర్లకు చెందిన ఇతర కంపెనీలకు నిధులు సర్దుబాటు చేసుకునేందుకు సైతం ఈ పనిచేయవచ్చు. అయితే, ప్రమోటర్ల వాటాల్లో ఎక్కువ భాగం తాకట్టులో ఉన్న వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నది విశ్లేషకుల సూచన.

 

అధిక శాతం వాటాలను తాకట్టు పెట్టినప్పుడు ఆ కంపెనీలు చేతులు మారే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని ఎలారా క్యాపిటల్‌ పేర్కొంది. ముఖ్యంగా ప్రమోటర్లు ఇతర వ్యాపారాల కోసం తమ వాటాలను తాకట్టు పెట్టినప్పుడు రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఆయా వ్యాపారాలు సరిగ్గా నడవక, క్యాష్‌ ఫ్లో దెబ్బతింటే రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని... దాంతో రుణాలిచ్చిన సంస్థలు ప్రమోటర్ల వాటాలను ఓపెన్‌ మార్కెట్లో విక్రయించినట్టయితే కంపెనీ యాజమాన్యం చేతులు మారుతుందని వివరించింది. ముఖ్యంగా ఒకవైపు ప్రమోటర్ల తనఖా వాటాల పరిమాణం పెరుగుతూ, అదే సమయంలో కంపెనీలో ప్రమోటర్ల వాటా తగ్గుతుంటే అది ప్రమాదానికి సంకేతమని సూచించింది. గత మూడు త్రైమాసికాల్లో ప్రమోటర్ల తనఖాలు రూ.25,200 కోట్ల మేర పెరిగి రూ.1,70,000 కోట్ల నుంచి రూ.1,95,200 కోట్లకు పెరిగినట్టు తెలిపింది. 

 

బీఎస్‌ఈ 500లో 27 కంపెనీల్లో ప్రమోటర్ల వాటాల తనఖా గడిచిన నాలుగు త్రైమాసికాలకు గాను మూడు త్రైమాసికాల్లో పెరిగినట్టు ఎలారా క్యాపిటల్‌ తెలిపింది. వీటిల్లో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, అపోలో హాస్పిటల్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సన్‌ఫార్మా, కల్పతరు పవర్‌, అరబిందో ఫార్మా, ఇమామి, అజంతా ఫార్మా, డిష్‌ టీవీ, అదానీ పోర్ట్స్‌, సద్బావ్‌ ఇంజనీరింగ్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఒమాక్సే, టైమ్‌ టెక్నోప్లాస్ట్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, డీబీ కార్ప్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, లారస్‌ ల్యాబ్స్‌, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఉన్నాయి. ముఖ్యంగా మూడు త్రైమాసికాల్లో ప్రమోటర్ల తాకట్టు పెరిగి, వారి తాకట్టు షేర్లు వారి మొత్తం వాటాల్లో 40 శాతానికి పైగా ఉంటే, వార్షికంగా క్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే కంపెనీలో ప్రమోటర్ల వాటా తగ్గితే ఆ కంపెనీలకు దూరంగా ఉండాలని ఎలారా సూచించింది. ఈ మూడు అంశాలు మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అదానీ పోర్ట్స్‌, ఒమాక్సేలో కనిపిస్తున్నాయి. You may be interested

ఈ మార్కెట్లో కొనతగిన షేర్లు ఏవి...?

Thursday 14th February 2019

మన ఈక్విటీ మార్కెట్లు చూడ్డానికి బలంగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇండెక్స్‌లోని ప్రధాన షేర్లతోపాటు కొన్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల అండతో సూచీలు ఒక నిర్ణీత పరిధిలో చలిస్తున్నాయి. కానీ, మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ మాత్రం ఎప్పటికప్పుడు కనిష్టాలకు పడిపోతూనే ఉన్నాయి. చాలా స్టాక్స్‌ వాటి 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 40 శాతానికి పైగా నష్టపోయినవే. ఇండెక్స్‌ కాకుండా విడిగా స్టాక్స్‌ను పరిశీలిస్తే కొన్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ సైతం 30-50

ఆరంభ లాభాలు ఆవిరి!

Wednesday 13th February 2019

10800 పాయింట్ల దిగువకు నిఫ్టీ బుధవారం లాభాలతో ఆరంభించిన సూచీలు చివర వరకు జోరు కొనసాగించలేకపోయాయి. మధ్యాహ్నం వరకు ఎంతో కొంత లాభాల్లో ట్రేడయిన సూచీలు చివరకు మ్రాతం నష్టాల్లోనే ముగిసాయి. బుధవారం సెన్సెక్స్‌ 120 పాయింట్ల నష్టంతో 36034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 10794 పాయింట్ల దిగువన క్లోజయ్యాయి. దాదాపు రెండువారాల తర్వాత నిఫ్టీ మరలా 10800 పాయింట్ల దిగువన క్లోజయి బేరిష్‌నెస్‌ చూపింది. ఇంట్రాడేలో

Most from this category