STOCKS

News


11,049 కోల్పోతే ప్రాఫిట్‌ బుకింగ్‌

Wednesday 28th August 2019
Markets_main1566931113.png-28057

నిఫ్టీ రెండు వారాల గరిష్ట స్థాయిలో మంగళవారం క్లోజ్‌ అయింది. ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నిధులను డివిడెండ్‌గా బదిలీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ద్రవ్యలోటు ఆందోళనలను తేలికపరిచింది. దీనికితోడు అంతర్జాతీయంగానూ ప్రతికూల సంకేతాలు లేకపోవడం మార్కెట్లు సానుకూలంగా ముగియడానికి దోహదపడ్డాయి. నిఫ్టీ 11,049కి పైన నిలదొక్కుకుంటే తదుపరి 11,181 వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు చార్ట్‌వ్యూ ఇండియా చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజర్‌ మహమ్మద్‌. 

 

‘‘ఇండెక్స్‌ డైలీ చార్ట్‌లో డోజీ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. తదుపరి గమ్యం విషయంలో ట్రేడర్లలో నిర్ణయలేమిని ఇది తెలియజేస్తోంది. ప్రారంభం, ముగింపు స్థాయి ఒకే విధంగా ఉన్నప్పుడు డోజి ఏర్పడుతుంది. అయితే, సెషన్‌ అంతటా సూచీ అటు, ఇటూ చలించడం బుల్స్‌, బేర్స్‌లో నిర్ణయం తీసుకోలేకపోవడాన్ని సూచిస్తోంది. టెక్నికల్‌గా చూస్తే ఇండెక్స్‌ 21 రోజుల ఈఎంఐ అయిన 11,063కు పైన క్లోజ్‌ అవడం కీలకమైన అంశం. గతంలో పుల్‌బ్యాక్‌లు ఆగిపోయింది ఇక్కడే’’ అని మజర్‌ మహమ్మద్‌ తెలిపారు. నిఫ్టీ 11,049పైన నిలదొక్కుకుంటే, ఆ తర్వాత 11,181 దిశగా ర్యాలీ ఉంటుందని అంచనా వేశారు. అలాగే, 11,049కు దిగువన క్లోజ్‌ అయితే ప్రాఫిట్‌ బుకింగ్ ఎదురుకావచ్చన్నారు. 11,000, 11,100 స్థాయిలో పుట్‌ ఆప్షన్ల రైటింగ్‌ ఎక్కువగా జరిగిందని, 11,300, 11,200 వద్ద కాల్‌ రైటింగ్‌ ఎక్కువగా జరిగినట్టు వెల్లడించారు. ఆప్షన్ల డేటా ఆధారంగా చూస్తే నిఫ్టీ 10,900-11,200 శ్రేణిలో ట్రేడ్‌ కావచ్చన్నారు.

 

నిఫ్టీ 11,181 వరకు ర్యాలీ చేయవచ్చని, కాకపోతే గత మూడు రోజులుగా కొనుగోళ్ల నేపథ్యంలో కొంత విక్రయాలు జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘ఇండెక్స్‌ గరిష్టంలో గరిష్టం, కనిష్టంలో కనిష్టాన్ని గత రెండు సెషన్లలో నమోదు చేసింది. 11,180 వరకు ర్యాలీ చేయాలంటే నిఫ్టీ 11,000 పైన నిలబడాలి. దిగువ వైపున 11,000, 10,929 మద్దతు స్థాయిలు’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా తెలిపారు. ‘‘11,181, 11,200 కీలకమైన నిరోధాలు. వీటిని గమనించాలి. వీటిని దాటుకుని వెళ్లడంలో నిఫ్టీ విఫలమైతే వెనుదిరిగినట్టే’’ అని షేర్‌ఖాన్‌కు చెందిన గౌరవ్‌ తర్నపార్కి తెలిపారు.



You may be interested

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Wednesday 28th August 2019

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 14 పాయింట్ల లాభంతో 37,655.77 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు స్వల్ప నష్టంతో 11,101.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడే వీలున్నట్లు పెరిగిన ఆందోళనలతో మంగళవారం అమెరికా మార్కెట్లు, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.  ఇక

2020 చివరికి మాంద్యం..!!?

Wednesday 28th August 2019

కార్వీ రాజీవ్‌ సింగ్‌  బంగారం ర్యాలీ కొనసాగుతుందని, బంగారంపై ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సీఈవో రాజీవ్‌సింగ్‌ సూచించారు. 2020 చివరి నాటికి మాంద్యం రావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.    అంతర్జాతీయ ఆర్థిక రంగం మాంద్యంలోకి వెళుతోందా? బ్యాంకు ఆఫ్‌ అమెరికా-మెరిల్‌ లించ్‌ ఫండ్‌ మేనేజర్‌ సర్వేలో తేలిందేమంటే... 34 శాతం మంది వచ్చే 12 నెలల్లో మాంద్యం రావచ్చని

Most from this category