News


ఎస్‌బీఐ మినహా ఇతర పీఎస్‌బీలకు దూరం

Tuesday 7th January 2020
Markets_main1578381247.png-30731

చౌకగా లభిస్తున్నాయని చిన్న బ్యాంక్స్‌ కొనొద్దు
పెట్టుబడులకు ప్రయివేట్‌ రంగ బ్యాంక్స్‌ మేలు
హేమంగ్‌ జానీ, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, షేర్‌ఖాన్‌ 

చిన్న బ్యాంకులు లేదా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో కొనుగోళ్లు చేపట్టడం అంత లాభించకపోవచ్చంటున్నారు మార్కెట్‌ నిపుణులు హేమంగ్‌ జానీ. రీసెర్చ్‌ సంస్థ షేర్‌ఖాన్‌కు సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అయిన జానీ.. పీఎస్‌యూ బ్యాంకింగ్‌ విభాగంలో స్టేట్‌బ్యాంక్‌ మెరుగైన కౌంటర్‌గా పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రయివేట్‌ రంగంలో పెద్ద బ్యాంకులవైపు దృష్టి సారించవచ్చునంటున్నారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా మరిన్ని అంశాలపై మాట్లాడారు. వివరాలు చూద్దాం..

నాణ్యత ప్రధానం
చౌకగా లభిస్తున్నాయని చిన్న బ్యాంకులు, పీఎస్‌యూ బ్యాంకులలో పెట్టుబడులకు దిగకపోవడమే ఉత్తమం. ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్టేట్‌బ్యాంక్‌ మెరుగైన పనితీరు చూపే అవకాశముంది. ఇదే విధంగా ప్రయివేట్‌ రంగ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకులనూ పెట్టుబడులకు పరిగణించవచ్చు. ప్రస్తుతం సమస్యాత్మక వాతావరణం నెలకొని ఉంది. దీంతో నాణ్యమైన సంస్థలవైపు దృష్టిపెట్టడం మేలు చేకూరుస్తుంది. వృద్ధి అవకాశాలు, ఆస్తుల(రుణాల) నాణ్యత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. రుణ వితరణ నీరసించడం, మరోసారి మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) పెరగనుండటం వంటి ప్రతికూల పరిస్థితుల్లో నిలకడైన వృద్ధి చూపగల బ్యాంకులను పరిశీలించాలి. 

చమురు సవాళ్లు
ఇటీవల మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో యాక్టివిటీ పెరిగింది. అయితే అంతర్జాతీయ వివాదాలు, చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో ఆర్థిక సవాళ్లు ఎదురుకానున్నాయి. దీంతో అధిక ఊగిసలాటకు లోనయ్యే కౌంటర్లు, వడ్డీ రేట్ల ఆధారిత సంస్థలకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రిస్క్‌లు పెరగడంతోపాటు, పెట్టుబడులు తగ్గిపోవచ్చు. పటిష్ట ఆర్థిక వృద్ధి కనిపిస్తేనే మిడ్‌ క్యాప్స్‌లో ర్యాలీ నిలబడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని బలమైన కంపెనీలు మాత్రమే నిలదొక్కుకునే వీలుంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ రంగంలో కొంతమేర దిద్దుబాటు(కరెక్షన్‌)కు అవకాశముంది. రానున్న రెండేళ్ల కాలాన్ని పరిగణిస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పటిష్ట పనితీరు చూపవచ్చు.

ఎగుమతి రంగాలు
రూపాయి బలహీనపడుతున్న వాతావరణంలో ఎగుమతి కంపెనీలు లబ్ది పొందగలవు. ఇటీవల ఐటీ, ఫార్మా, మెటల్‌ రంగాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే ఆకర్షణీయ ఫలితాలు సాధించగల కంపెనీలే ర్యాలీ చేయగలుగుతాయి. ఐటీ విభాగంలో ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ పెట్టుబడులకు అనువుగా కనిపిస్తు‍న్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు డాలర్ల ఆదాయంలో 1.5-2 శాతం వృద్ధిని మాత్రమే ఆశించగలుగుతాయి. ఇక వినియోగ రంగం విషయానికి వస్తే.. ఇటీవల గ్రామీణ ప్రాంత అమ్మకాలు కొంతమేర మందగించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాల్గేట్‌, హెచ్‌యూఎల్‌ కౌంటర్లను ఎంచుకోవచ్చు. ఇటీవల కొంత కరెక్షన్‌ను చవిచూసిన ఈ కంపెనీలు క్లిష్ట వాతావరణంలోనూ నిలదొక్కుకోగలుగుతాయి. అయితే ఈ స్టాక్స్‌ చౌకగా లభించకపోవడంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపని సంగతి తెలిసిందే. You may be interested

సబ్‌ ఎడిటర్లు కావలెను

Tuesday 7th January 2020

సాక్షి పత్రిక అనుబంధ బిజినెస్‌ వెబ్‌సైట్‌ "బిజినెస్‌@ సాక్షి డాట్‌ కామ్‌‌"లో పనిచేసేందుకు సబ్‌ ఎడిటర్లు/సీనియర్‌ సబ్‌ ఎడిటర్లు కావలెను. మీడియా సంస్థల్లో, న్యూస్‌ వెబ్‌సైట్లలో బిజినెస్‌ విభాగంలో సబ్ ఎడిటర్లుగా, కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సబ్‌ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. బిజినెస్‌, ఎకానమీ, ఫైనాన్షియల్‌ మార్కెట్లపై అవగాహన కలిగి ఉండాలి. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ బాగా చేయగలగాలి.  30 సంవత్సరాల లోబడిన వయసు కలిగిన అర్హులైన అభ్యర్థులు

ఈక్విటీల కంటే బంగారమే బెటర్‌: విశ్లేషకులు

Tuesday 7th January 2020

ఈ ఏడాది కూడా పసిడిదే హవా అంటున్న విశ్లేషకులు  పోర్ట్‌ఫోలియోలో పసిడికి 15శాతం కేటాయించమని సలహా గతేడాది ఈక్విటీల కంటే అధిక రాబడులను పంచిన పసిడి.. ఈ ఏడాది కూడా ట్రెండ్‌ను కొనసాగించవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లపై మెతక ధోరణి తదితర అంశాలతో 2019 ఏడాదిలో కామెక్స్‌ (న్యూయార్క్‌) గోల్డ్‌ పసిడి 14శాతం ర్యాలీ

Most from this category