News


నేలచూపులతో ప్రిన్స్‌ పైప్స్‌ లిస్టింగ్‌

Monday 30th December 2019
Markets_main1577683116.png-30523

10 శాతం తక్కువగా రూ. 160 వద్ద షురూ
ఐపీవో ధర కంటే దిగువన ట్రేడింగ్‌

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ ముగించుకున్న ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్స్‌ లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో నష్టాలతో లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 178తో పోలిస్తే 10 శాతం డిస్కౌంట్‌తో రూ. 160 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. వెరసి ఇష్యూ ధర కంటే రూ. 18 తక్కువలో లిస్టయ్యింది. తదుపరి ఎన్‌ఎస్‌ఈలో రూ. 175.50 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 152.50 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. 10.40 ప్రాంతంలో రూ. 7 నష్టంతో రూ. 171 వద్ద కదులుతోంది. పైపులు, ఇతర ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తయారు చేసే ప్రిన్స్‌ పైప్స్‌ ఐపీవో 2.2 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయిన సంగతి తెలిసిందే. తద్వారా కంపెనీ రూ. 500 కోట్లను సమీకరించింది. ఐపీవో నిధులలో అత్యధిక భాగాన్ని తయారీ ప్లాంటు ఏర్పాటు, రుణాల చెల్లింపు తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో తెలియజేసింది. కంపెనీ దాద్రానగర్‌ హవేలీ, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్తాన్‌లలో తయారీ ప్లాంట్లను కలిగి ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.
 



You may be interested

ఎల్‌ఐసీకి అనిల్‌ అంబానీ గ్రూప్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దెబ్బ

Monday 30th December 2019

లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మొండి బకాయిల కోసం కేటాయింపులు 30 శాతం పెరిగి రూ. 23760 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. రియల్టీ, లోన్లు, ఇతర ఆస్తుల్లో తమ పెట్టుబడుల సమీక్ష అనంతరం మొండిపద్దులకు కేటాయించిన మొత్తాలు పెరిగినట్లు తెలిసిందని కంపెనీ వెల్లడించింది. ఎల్‌ఐసీ నుంచి రుణాలు తీసుకున్న కంపెనీల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలున్నాయి. ఇవన్నీ డిఫాల్ట్‌ కావడంతో ఎల్‌ఐసీ నెత్తిన

స్కిప్పర్‌- గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ జూమ్‌

Monday 30th December 2019

దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు సోమవారం హుషారుగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ 126 పాయింట్లు పెరిగి 41,701కు చేరగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 12281 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ డెవలప్‌మెంట్స్‌ ఆధారంగా ఇటు స్కిప్పర్‌ లిమిటెడ్‌, అటు గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌తోపాటు స్నోమన్‌ లాజిస్టిక్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. స్కిప్పర్‌ లిమిటెడ్‌ దేశీయంగా తొలిసారి విజయవంతంగా 765 కేవీ S/C

Most from this category