News


టెలికం షేర్లు ఇక రేసు గుర్రాలేనా?

Thursday 21st November 2019
Markets_main1574276258.png-29737

వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ గత మూడు రోజుల్లో మంచి ర్యాలీ చేశాయి. ఒకవైపు ఏజీఆర్‌ (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం)పై సుప్రీంకోర్టు తీర్పుతో ఈ రెండు కంపెనీకు కేంద్రానికి సుమారు రూ.90వేల కోట్ల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, ఈ తరహా ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో వ్యాపార నిర్వహణ కష్టమంటూ వచ్చే నెల నుంచి మొబైల్‌ టారిఫ్‌ ధరలను పెంచనున్నట్టు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రకటించడంతో వాటి షేర్ల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తికి దారితీసింది. ఇకపై వీటిల్లో భారీ ర్యాలీ ఉంటుందా..?

 

జెఫరీస్‌ ఫైనాన్షియల్‌ గ్రూపు ఈక్విటీ రీసెర్చ్‌ విభాగం అభిప్రాయం ప్రకారం.. ‘‘ధరల పెంపు సానుకూలమే. 2020-21 ఆరంభం నుంచి ధరలను పెంచే అవకాశం ఉంటుందన్న మా అంచనాలకు ముందుగానే ఇది చోటు చేసుకుంది. అయితే ధరల పెంపు 20 శాతానికి మించి ఉంటే తప్ప ఈ షేర్ల విషయంలో మేము ఇచ్చిన ప్రైస్‌ టార్గెట్‌లో ఎటువంటి మార్పు ఉండబోదు’’ అని పేర్కొంది. ప్రభుత్వం తాజాగా ఏజీఆర్‌ చెల్లింపులపై రెండు ఆర్థిక సంవత్సరాల వరకు మారటోరియం విధించింది. అంటే భారీ చెల్లింపుల భారం రెండేళ్లు వాయిదా పడినట్టే. కాకపోతే, లైసెన్స్‌ ఫీజు తగ్గింపు, ఇతర ఉపశమన చర్యలను కూడా కంపెనీలు ఆశించాయి. వాటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఏజీఆర్‌ బకాయిల విషయంలో వచ్చే చర్యలు వొడాఫోన్‌ ఐడియాకు ఎంతో కీలకమని జెఫరీస్‌ పేర్కొంది. లైసెన్స్‌ ఫీజు తగ్గింపు, ఐయూసీ చార్జీల ఎత్తివేత పొడిగింపు నిర్ణయాలను కూడా తాము అంచనా వేస్తున్నట్టు తెలిపింది.

 

గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ అయితే భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.415 టార్గెట్‌తో కొనుగోలుకు సిఫారసు చేసింది. కానీ, ఈ షేరు ఇప్పటికే రూ.437 వరకు పెరిగింది. ‘‘ఇటీవలి ర్యాలీ తర్వాత కూడా కొనుగోలు రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. స్థిరమైన ధరల పెంపు, మార్కెట్‌ వాటా పెంపు, ప్రభుత్వం నుంచి ఉపశమన చర్యలు వ్యాపార నిర్వహణ పరంగా కలసివస్తాయి. ధరల పెంపు వచ్చే కొన్ని నెలల పాటు స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. ఎక్కువగా లబ్ధి పొందేది వొడాఫోన్‌ ఐడియా. కానీ, ఏజీఆర్‌ అంశం దీర్ఘకాలం పాటు ఈ సంస్థ రికవరీపై సందేహాలను లేవనెత్తుతోంది’’ అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ పేర్కొంది. ఎయిర్‌టెల్‌కు మోర్గాన్‌ స్టాన్లీ రూ.410 టార్గెట్‌ ఇచ్చింది.
 You may be interested

వీటిల్లో గత వైభవం సాధ్యమేనా...?

Thursday 21st November 2019

పెట్టుబడులపై అధిక రాబడుల కోసం ఈక్విటీల వైపు అడుగు వేసే ఇన్వెస్టర్ల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. పది పదిహేనేళ్ల క్రితంతో పోలిస్తే నేడు స్టాక్‌ ట్రేడింగ్‌ ఎంతో సులభంగా మారింది. డేటా దిగి రావడం, టెక్నాలజీ ఆధునికత రూపును సంతరించుకోవడం వంటి ఎన్నో కారణాలున్నాయి. అయితే, భారీ రాబడుల ఆకాంక్షలతో ఈక్విటీ మార్కెట్ల వైపు చూసే వారు ముందుగా పెట్టుబడులను ఎటువంటి కంపెనీల్లో పెట్టాలన్నది పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతే

మూడోరోజూ లాభాల ముగింపే..!

Wednesday 20th November 2019

  ఇంట్రాడేలో కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌  11999 వద్ద ముగిసిన నిఫ్టీ  రాణించిన ఫార్మా, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు  సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ఐనప్పటికీ వరుసగా మూడోరోజూ లాభంతో ముగిశాయి. ఫార్మా, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్‌ 182 పాయింట్ల లాభంతో 40,652 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్ల పెరిగి 11999.10  వద్ద ముగిసింది. సూచీలకిది వరుసగా మూడోలాభాల ముగింపు కావడం

Most from this category