News


పసిడి ర్యాలీకి ప్రస్తుతానికి బ్రేక్‌

Monday 28th October 2019
Markets_main1572255311.png-29182

పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో1,550డాలర్ల స్థాయి నుంచి మరింత పెరగకపోవొచ్చని, ఆ స్థాయి నుంచి క్రమేపీ తగ్గవచ్చని యస్‌సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హితేశ్‌ జైన్‌ అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య సమస్యలు, ప్రపంచ ఉత్పాదక కార్యకలాపాలలో క్షీణత, సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల తగ్గింపు, సావరిన్‌బాండ్ల ఈల్డ్‌ పతనం కావడం వంటి అంశాలతో  పసిడి ధర సెప్టెంబర్‌లో ఆరేళ్ల గరిష్టాన్ని అందుకుంది. పైన పేర్కొన్న ప్రతికూలాంశాలన్నింటినీ బంగారం ఇప్పటికే ఇముడ్చుకుంది. ఈ రకంగా పరిస్థితులేవైనప్పటికీ.., పసిడి ధర హేతబద్ధంగానే లాభపడిందని హితేష్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు.  అయితే ఇంతకుమించి పెరిగే సంకేతాలేవీ ప్రస్తుతం కన్పించడం​ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పసిడి ధరకు బ్రేకులు పడటానికి కారణాల్ని ఆయన ఒక వ్యాసంలో ఇలా వివరించారు......  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ., మాంద్యం యొక్క సంపూర్ణ ప్రమాదం ఇంకా పూర్తి కార్యరూపం దాల్చలేదు అనే వాస్తవాన్ని మనం అంగీకరించాలి. ఈ ఏడాదిలో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3.0శాతంగా ఉంటుందని, వచ్చే ఏడాదికి వృద్ధి 3.4శాతంగా నమోదువుతుందని ఐఎంఎఫ్‌ చెబుతోంది. తయారీ, వాణిజ్యంలో క్షీణత కారణంగా యూఎస్‌ఏ జీడీపీ వృద్ధి మందగించినప్పటికీ, ప్రైవేట్ వినియోగం స్థితిస్థాపకంగా ఉంది. బాండ్లలో నెగిటివ్‌ ఈల్డ్‌ ఫలితంగా ఆర్థిక మాంద్య ప్రభావం ఫైనాన్షియల్‌ మార్కెట్లకు విస్తరిస్తుందనే విషయం అవగతం అవుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జర్మనీలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ జర్మన్ ఈల్డ్‌ బాండ్‌, జపనీస్‌ బాండ్‌ ఈల్డ్‌ కంటే ఎక్కువ నెగిటివ్‌గా ఉంది.  అయితే ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఉద్దీపన అనేది ప్రపంచ ఆర్థిక ఇంజిన్‌కు అవసరమైన ప్రేరణను అందిస్తుంది, ఇది దీర్ఘకాల బాండ్లు, పసిడి వాణిజ్యానికి ప్రతికూలంగా మారుతుందని హితేశ్‌ అభిప్రాయపడ్డారు. ఈ వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఔన్స్‌ పసిడి ధర 1,550డాలర్ల దిగువనే ట్రేడ్‌ అయ్యే అవకాశం ఉంది. క్రమేపీ తగ్గుతూ 1,350-1,400 డాలర్ల పరిధిలో కన్సాలిడేషన్‌ జరగవచ్చు.
 
ఇక దేశీయంగా పసిడి విషయానికొస్తే.. ఆభరణాల వినియోగం తగ్గడం, స్థానిక కరెన్సీ బలపడటం, దిగుమతులపై సుంకాన్ని పెంచడటంతో భారత్‌లో భౌతిక పసిడి మరింత బలహీనపడింది. ఎంసీఎక్స్‌లో దిగువశ్రేణిలో 10గ్రాముల పసిడి ధర రూ.35,000ల పరిధిలో ట్రేడయ్యే అవకాశం ఉంది. You may be interested

ఈ బ్యాంక్‌ సీఈఓ పదవికి 70 మంది బ్యాంకర్ల పోటీ

Monday 28th October 2019

  ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌) పీసీఏ(ప్రాంప్టడ్‌ కరక్టివ్‌ యాక్షన్‌)ను ఎదుర్కొంటున్న లక్షీవిలాస్‌ బ్యాంక్‌(ఎల్‌వీబీ)లో చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌(ముఖ్య నిర్వహణాధికారి), మేనేజింగ్‌ డైరక్టర్‌(ఎండీ) పదవి కోసం 70 మంది బ్యాంకర్లు పోటీపడుతున్నారు. ఇందుకోసం టాప్‌ బ్యాంకర్ల నుంచి 70 దరఖాస్తులు వచ్చాయని ఎల్‌వీబీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వివిధ బ్యాంకులకు చెందిన సీనియర్‌ నిర్వహణ అధికారులు ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, వీరిలో నష్టాల్లో ఉన్న ఆర్థిక సంస్థలను లాభల్లోకి తీసుకొచ్చిన వారున్నారని అన్నారు. కాగా

11900 పాయింట్ల వరకు నిఫ్టీ ర్యాలీ!

Monday 28th October 2019

నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు క్రమంగా నెగిటివ్‌ మూడ్‌లోనుంచి బయటకు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే కొత్త సంవత్‌ను సూచీలు పాజిటివ్‌గా ఆరంభించాయి. పూర్తిగా ఎకానమీలో పరిస్థితులు మారకపోయినా, బుల్స్‌ క్రమంగా తమ పట్టు బిగించడానికే యత్నిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో సూచీలు క్రమంగా ముందుకే కొనసాగే అవకాశముందని నిపుణుల అంచనా.  నిఫ్టీపై మార్కెట్‌ పండితుల అంచనాలు... 1. సమిత్‌ చవాన్‌, ఏంజల్‌ బ్రోకింగ్‌: చార్టుల్లో నిఫ్టీ కీలక నిరోధ

Most from this category