News


కొన్నిషేర్ల క్షీణత శాశ్వతం!

Thursday 25th July 2019
Markets_main1564048883.png-27315

వాల్యూ బయింగ్‌ మోజులో తప్పు చెయ్యొద్దు
పెట్టుబడులకు ముందు ఫండమెంటల్స్‌ చూడాలి

సీనియర్‌ అనలిస్టు సంజయ్‌ బక్షి
మార్కెట్లో షేర్లు భారీగా పతనమయ్యాక వాల్యూ ఇన్వెస్టర్లు కాంట్రా పెట్టుబడులకు ముందుకు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇలాంటి వాల్యూ ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని సీనియర్‌ అనలిస్టు సంజయ్‌ బక్షి హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారీగా పతనమైన పలు స్టాకుల్లో ఎక్కువ శాతం షేర్ల ధరలు కోలుకోకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా షేర్లలో ఈ దఫా వచ్చిన పతనం శాశ్వతంగా ఉండబోతోందని, ఇకపై ఈ స్టాకులు తమ గత గరిష్ఠాలను చూడడం అసాధ్యమని చెప్పారు. జెట్‌ ఎయిర్‌వేస్‌, పీసీజువెల్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, ఆర్‌కామ్‌, ఆర్‌పవర్‌, ఆర్‌నావల్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, ఆర్‌క్యాప్‌ లాంటి స్టాకులు సంపద విధ్వంసకర షేర్లని, ఇవి హీరో స్థాయి నుంచి జీరోస్థాయికి మారాయని, వీటిలో చాలా వరకు ఇకపై కోలుకోవడం కల్లని చెప్పారు. ఈ షేర్ల పతనం వెనుక ప్రధాన కారణాలు వాటి రుణభారం, ఇన్వెస్టర్ల మూక మనస్థత్వమని వివరించారు. 
దేశీయ సూచీల్లో నెలకొన్న పతనం పలు బడా ఇన్వెస్టర్లను కూడా భయపెడుతోంది. దీంతో పెద్ద ఇన్వెస్టర్లు సైతం తమ పోర్టుఫోలియోలను కుదించుకుంటున్నారు. లిక్విడిటీ కొరత, బడ్జెట్‌ ప్రతిపాదనలు, మందగమనం, ఎర్నింగ్స్‌ బలహీనతల్లాంటి కారణాలు అటు లార్జ్‌క్యాప్స్‌ నుంచి ఇటు చిన్న స్టాకులను కుంగదీస్తున్నాయి. ఇలాంటి పతనాల్లో రిటైలర్లు బాటమ్‌ ఫిషింగ్‌, వాల్యూ ఇన్వెస్టింగ్‌ పేరిట భారీగా పడిపోయిన షేర్లను కొనేందుకు ఉత్సాహం చూపుతుంటారు. బాగా పడిన షేర్లు మార్కెట్‌ కోలుకునే సమయంలో మంచి రాబడులిస్తాయని నమ్ముతుంటారు. కానీ ఇలాంటి పతనం తర్వాత చాలా కొద్ది స్టాకులు మాత్రమే గత గరిష్టాలను చూస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక కంపెనీ బిజినెస్‌ మోడల్‌పై అపనమ్మకం ఏర్పడి ఆ కంపెనీ షేరు కుప్పకూలిన తర్వాత తిరిగి కోలుకోవడం కద్దని, సదరు షేరు శాశ్వత డీరేటింగ్‌కే అవకాశాలుంటాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. 2010 నుంచి చూస్తే 75 శాతానికి మించి పతనమైన 228 స్టాకుల్లో కేవలం 8 స్టాకులు మాత్రమే పుంజుకొని మరలా పాత స్థాయిలను చూసాయి. అందువల్ల కేవలం బాగా పడిపోయాయనే ఒక్క విషయాన్ని చూసి షేర్లలో పెట్టుబడులు పెట్టవద్దని, సదరు కంపెనీ సంపూర్ణ వివరాలను అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలని సంజయ్‌ సూచించారు. You may be interested

సెంటిమెంట్‌ మెరుగవ్వకపోతే మరో 8 శాతం పతనం!

Thursday 25th July 2019

మార్కెట్‌పై నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా ఎకానమీ, మార్కెట్లలో సెంటిమెంట్‌ మెరుగుపడకుంటే సూచీలు మరో 6- 8 శాతం పతనం కావడం ఖాయమని నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ సీఐఓ శైలేంద్ర కుమార్‌ అభిప్రాయపడ్డారు. సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారాలంటే ఎన్‌పీఏ కేసులు కొన్నైనా పరిష్కారం కావడం, ఆర్‌బీఐ భారీగా రేట్లను తగ్గించడం లాంటివి అవసరమన్నారు. ఎకానమీలో లిక్విడిటీ సమస్య పరిష్కారానికి బడ్జెట్లో ప్రకటించిన చర్యలు బాగున్నాయని, వీటి ప్రభావం కనిపించడానికి మరో 4-5

ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ పరిస్థితిని వాడుకోండి: సెంట్రమ్‌

Thursday 25th July 2019

మంచి స్టాకులను ఎంచుకోని ఇన్వెస్ట్‌ చేయండి. వచ్చే రెండు త్రైమాసికాల వరకు ఆర్థిక మందగమనం ఉండవచ్చు. సిమెంట్‌ రంగంలో అల్ట్రాటెక్‌, శ్రీ సిమెంట్‌ను పరిశీలించవచ్చు. టెలికాం రంగానికి దూరంగా ఉండండి: దేవాంగ్‌ మెహతా వచ్చే రెండు త్రైమాసికాలలో మంచి స్టాకులను ఎంచుకోని వాటిలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ పరిస్థితిని వాడుకోండి సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈక్విటీ అడ్వజరీ హెడ్‌ దేవాంగ్‌ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. బాధ ఇంకా

Most from this category