News


ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ హైజంప్‌- ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ పతనం

Monday 20th January 2020
Markets_main1579510859.png-31049

ఉన్నట్టుండి ఊపందుకున్న అమ్మకాల కారణంగా మార్కెట్లు  పతన బాట పట్టాయి. మధ్యాహ్నం 2.10 సమయంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు, నిఫ్టీ 85 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. కాగా.. లోఖండ్వాలా డీబీ రియల్టీ కంపెనీలో ప్రధాన వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ భారీ లాభాలతో కళకళలాడుతుంటే.. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌
సొంత అనుబంధ సంస్థ ప్రెస్టేజ్‌ ఫాల్కన్‌ రియల్టీ వెంచర్స్‌ ద్వారా లోఖండ్వాలా డీబీ రియల్టీ కంపెనీలో 50 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌ పేర్కొంది. కేపిటల్‌ అకౌంట్‌ ద్వారా ఈ వాటాను సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. దీంతో లోఖండ్వాలా డీబీలో 50 శాతం ఆర్థిక, వోటింగ్‌ హక్కులను పొందినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 413 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 426 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. 

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ నికర లాభం 2 శాతం క్షీణతతో రూ. 725 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 8 శాతంపైగా పెరిగి రూ. 3736 కోట్లకు చేరింది. ఇక నికర వడ్డీ మార్జిన్లను 7.29 శాతం వద్ద నిలకడను చూపాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ షేరు 6.6 శాతం పతనమైంది. రూ. 119 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు జూమ్‌

Monday 20th January 2020

చెన్నై పెట్రోలియం హైజంప్‌ గోవా కార్బన్‌ అప్పర్‌ సర్క్యూట్‌ పాలీకేబ్‌ ఇండియా కొత్త గరిష్టం తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు  పతన బాట పట్టాయి. మధ్యాహ్నం 2.30 సమయంలో సెన్సెక్స్‌ 333 పాయింట్లు పతనమై 41,612ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 12,245 వద్ద ట్రేడవుతోంది. ఈ పరిస్థితుల్లోనూ విభిన్న వార్తల కారణంగా చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌, గోవా కార్బన్‌, పాలీకేబ్‌ ఇండియా

నేడు బడ్జెట్‌ హల్వా ఉత్సవం

Monday 20th January 2020

హల్వా తయారితో బడ్జెట్‌ రూపలక్పనకు శ్రీకారం! -నార్త్‌ బ్లాక్‌లో హల్వా ఉత్సవం న్యూఢిల్లీ: భారత సంప్రదాయంలో ఏ పనిని ప్రారంభించాలన్నా మొదట స్వీట్‌తో నోరు తీపిచేసుకుని ప్రారంభించడం ఆనవాయితి. ఇక ప్రతిఏటా బడ్జెట్‌ను రూపొందించే ముందు కూడా అధికారులందరి నోరు తీపిచేయడం తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా సోమవారం(జనవరి 20) న హల్వా తయారు చేసి బడ్జెట్‌-2020 రూపకల్పనలో పాల్గొనే అధికారులందరికి ఆర్థిక మంత్రి నార్త్‌ బ్లాక్‌లో నోర్లు తీపి

Most from this category