News


వివిధ రంగాలకు ఉద్దీపన....2.30 గంటలకు ఆర్థిక మంత్రి ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌!

Saturday 14th September 2019
Markets_main1568445394.png-28375

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(సెప్టెంబర్‌ 14) మధ్యాహ్నాం 2.30 సమయానికి జాతియ మిడియా కేంద్రం, ఢిల్లీ నుంచి ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడనున్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక మందగమనాన్ని తగ్గించేందుకు  వివిధ రంగాల వారిగా మరికొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు తెలిపారు. కాగా ఈ రోజు మధ్యాహ్నాం 2.30కి ఆర్థిక మంత్రి ఢిల్లీ నుంచి ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడనున్నారని ప్రెస్‌    ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపింది.
   ఈ ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌ ద్వారా రియల్టీ, ఎగుమతి రంగాలకు ఊతమిచ్చే చర్యలను ప్రకటించవచ్చని, వీటితో పాటు విస్తృతంగా ఆర్థిక చర్యలను, వివిధ రంగాల వారిగి చర్యలను ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు తెలిపారు. ప్రకటించవలసిన చర్యలకు సంబంధించి వివరణాత్మకమైన ఒక ప్రెజెంటేషన్‌లను ఆర్థిక శాఖ అధికారులు సెప్టెంబర్‌ 13న  తయారు చేశారని పరిశీలకులు తెలిపారు. 
   ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికానికి గాను దేశ జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఎఫ్‌పీఐ(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్లు), దేశియ ఇన్వెస్టర్లపై విధించిన అదనపు సర్‌చార్జీని తొలగించడం, వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయడం, ఆటో రంగానికి ఉపశమన ప్యాకేజిని ప్రకటించడం వంటి ఆర్థిక చర్యలను ప్రభుత్వం గత కొన్ని వారాల్లో  ప్రకటించిన విషయం గమనార్హం. ఈ కాన్ఫెరెన్స్‌తో పాటు వచ్చే వారం గోవాలో జరగనున్న జీఎస్‌టీ కౌన్సిల్‌ మీటింగ్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. ఈ సమావేశంలో వాహనాలపై విధించే జీఎస్‌టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే అవకాశం ఉంది.



You may be interested

ఫండ్స్‌ ఏం కొన్నాయి...ఏం విక్రయించాయ్‌?

Saturday 14th September 2019

 జులై నెలలో కంటే దేశియ ఈక్విటీ మార్కెట్లు అగష్టులో కొంత సానుకూలంగా కదిలాయి. విదేశి సంస్థాగత ఇన్వెస్టర్లు అగష్టులో కూడా అధికంగా అమ్మకాలకు పాల్పడగా, దేశియ సంస్థాగత ఇన్వెస్టర్లు నికర కొనుగోలు దారులయ్యారు. బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ జూన్‌, జూలై నెలలో భారీగా దిద్దుబాటుకు గురవ్వగా, అగష్టులో మాత్రం కొంత కోలుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు జూన్‌లో 8 శాతం, జులైలో 11 శాతం పతనంకాగా, అగష్టులో

స్వల్పంగా పెరిగిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 14th September 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శనివారం స్వల్పలాభంతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ ముగిసే సరికి 11,130.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11105.55 పాయింట్లతో పోలిస్తే 25 పాయింట్ల లాభంతో, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రితం ముగింపు (11111.00)తో పోలిస్తే 19 పాయింట్ల లాభంతో ఉంది. జాతీయ, అంతర్జాతీయంగా నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే

Most from this category