News


స్మాల్‌, మిడ్‌క్యాప్‌ల్లో ఎంట్రీకి ఇదే సరియైన సమయం!

Friday 13th September 2019
Markets_main1568368608.png-28358

మార్కెట్‌లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ తిరిగి పుంజుకున్నట్టనిపిస్తోందని, ఇలాంటి సమయంలో చాలా వరకు మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల వాల్యుషన్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అన్నారు. కాగా బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 2019 లో చేరుకున్న గరిష్ఠ స్థాయి నుంచి (ప్రస్తుతానికి) 22 శాతం కన్నా అధికంగా, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 16 శాతం కన్నా అధికంగా పతనమయ్యాయి.ఈ సమయంలో సెన్సెక్స్‌ 7 శాతం నష్టయింది. ఇదే విధంగా నిఫ్టీ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు కూడా వాటి గరిష్ఠ స్థాయిల నుంచి భారీగా పడిపోయాయి. ఇటువంటి పరిస్థితులలో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారు, ప్రాథమికంగా బలంగా ఉన్న, స్థిరంగా వృద్ధి చెందుతున్న కొన్ని మిడ్‌ క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లను పరిశీలించడం మంచిదని విశ్లేషకులు సలహాయిస్తున్నారు.
    ‘2018 జనవరిలో చేరుకున్న గరిష్ట స్థాయిల నుంచి ఎన్‌ఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 25 శాతం దిద్దుబాటుకు గురవ్వగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 40 శాతం పతనమయ్యింది. మరోవైపు, నిఫ్టీ ఇదే కాలానికి గాను 6 శాతం పెరగడం గమనార్హం’ అని ఐడీఎఫ్‌సీ ఏఎంసీ ఫండ్ మేనేజ్‌మెంట్, ఈక్విటీ సీనియర్ మేనేజర్ విరాజ్ కులకర్ణి అన్నారు. ‘సానుకూల పీఈ(ప్రైస్‌ టూ ఎర్నింగ్‌ రేసియో) ప్రాతిపదికన 15.0 రెట్లు వద్ద ఎన్‌ఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 21.0 రెట్లు వద్ద ట్రేడవుతోంది. 2018 జనవరి నుంచి ఇప్పటి వరకు గమనిస్తే..నిఫ్టీ, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ల రిటర్న్‌ల మధ్య అంతరం 46 శాతం ఉంది. స్వల్పకాలిక ప్రతికూలతలున్నప్పటికి దీర్ఘకాలానికి గాను పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లుకు, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ల  ప్రస్తుతం స్థాయి ఆకర్షణీయమైన ఎంట్రీ పాయింట్‌గా ఉంది’ అని ఆయన అన్నారు. కాగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు వరుసగా ఏ రెండేళ్లలోను కూడా ప్రతికూల రిటర్న్‌లను ఇవ్వకపోవడం గమనార్హం. ఈ ఇండెక్స్‌లు 2018 లో భారీగా పతనమవ్వడంతో ఈ ఏడాది బాగా రాణించగలవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
   ‘గత చరిత్రను పరిశీలిస్తే వరుసగా ఏ రెండెళ్లలో కూడా విస్తృత మార్కెట్ నెగిటివ్‌ రిటర్న్‌లను ఇవ్వలేదనే విషయం తెలుస్తుంది. వచ్చే మూడు,ఆరు నెలల్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రంగాలలో మంచి రిటర్న్‌లను ఆశించవచ్చు. వాస్తవానికి, గత ఒకటి, రెండు వారాల నుంచి ఈ రంగాలలో పాజిటివ్‌ సంకేతాలను చూశాం’ అని ట్రేడింగ్‌బెల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అమిత్ గుప్తా అన్నారు. ‘ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో మిడ్, స్మాల్‌క్యాప్‌లను పరిశీలించమని మా ఖాతాదారులకు సలహా ఇస్తున్నాం’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘జియోజిత్ ఈక్విటీ మోడల్ పోర్ట్‌ఫోలియోలో మిడ్, స్మాల్ క్యాప్‌ల మిశ్రమాన్ని 17.5 శాతానికి పెంచాము. మా పోర్టుపోలియో 75 శాతం లార్జ్‌క్యాప్‌లతో నిండి వుండగా, 7.5 శాతం గోల్డ్‌బీస్‌(గోల్డ్‌ ఈటీఎఫ్‌)తో నిండి ఉంది. కానీ భవిష్యత్‌లో నిర్దిష్ట స్టాక్స్‌ ప్రాతిపదికన, స్మాల్, మిడ్‌క్యాప్‌ల స్టాకులను పెంచుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం’ అని ఆయన వివరించారు.

గమనిక: 2019 లో ఎస్ అండ్‌ పీ బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో  30-80 శాతం పడిపోయిన టాప్ 20 స్టాక్స్. ఈ స్టాక్స్‌ కొనమని సాక్షి సలహా ఇవ్వడం లేదు. కేవలం ఇది రిఫరెన్స్‌ కోసం మాత్రమే.You may be interested

11050 పైన ముగిసిన నిప్టీ

Friday 13th September 2019

280 లాభపడ్డ సెన్సెక్స్‌ కలిసొచ్చిన మిడ్‌సెషన్‌ అనంతర కొనుగోళ్లు రాణించిన అటో, బ్యాంకింగ్‌, ఆయిల్‌ షేర్లు మార్కెట్‌లో మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన స్థిరమైన కొనుగోళ్లతో సూచీలు శుక్రవారం భారీ లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 280.71 పాయింట్ల లాభంతో 37,385 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 11,076 వద్ద ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో నేటి ఉదయం మార్కెట్‌ ఉత్సాహంగా ప్రారంభమైంది. అయితే నిన్న కేంద్రం ప్రకటించిన ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ను నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో

ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లలో అనూహ్య ర్యాలీ

Friday 13th September 2019

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లకు శుక్రవారం మిడ్‌సెషన్‌లో అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ మూడు షేర్లు ఇంట్రాడేలో 7శాతం నుంచి 3శాతం ర్యాలీ చేశాయి.  బీపీసీఎల్‌లో కేంద్రం తన వాటాను విదేశీ ఆయిల్‌ కంపెనీకి విక్రయిస్తుందనే వార్తలు వెలుగులోకి రావడంతో ఈ కంపెనీ షేర్లు 7శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.2:15లకు షేరు క్రితం ముగింపుధర(రూ.384.20)తో పోలిస్తే ఈ షేరు 6శాతం లాభంతో రూ.407.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది కేంద్రం కంపెనీలో

Most from this category