STOCKS

News


అధిక వాల్యూషన్లతో ఆటు పోట్లు!

Saturday 16th November 2019
Markets_main1573887270.png-29643

జియోజిత్‌ ఫైనాన్షియల్స్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌
దేశీయ బ్లూచిప్‌ స్టాకుల్లో ప్రీమియం వాల్యూషన్లున్నాయని, ఇందువల్ల షార్ట్‌టర్మ్‌కు మార్కెట్లో ఆటుపోట్లు తప్పకపోవచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్స్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. వాల్యూషన్లకు ఎర్నింగ్స్‌కు మధ్య వ్యత్యాసం తాజా ర్యాలీ అనంతరం పెరగడంతో స్వల్పకాలానికి మార్కెట్‌ ట్రెండ్‌ ఒడిదుడుకులతో ఉండొచ్చని చెప్పారు. అంతర్జాతీయ దేశీయ సానుకూల వార్తలు ఈక్విటీల్లో ర్యాలీ తెచ్చాయన్నారు. వారాంతానికి ఇండియా రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ వార్తలో ప్రాఫిట్‌బుకింగ్‌ వచ్చిందన్నారు. కీలక ఎకనామిక్‌ గణాంకాలు నెగిటివ్‌గా రావడం కూడా సెంటిమెంట్‌పై ‍ప్రభావం చూపిందన్నారు. షార్ట్‌టర్మ్‌కు దేశీయ సూచీలను గణాంకాలే నడిపిస్తాయని అంచనా వేశారు. అటు గణాంకాలు బాగాలేకపోవడం, ఇటు వాల్యూషన్లు పెరగడంతో మార్కెట్లలో అప్‌మూవ్‌ చాలా పరిమితంగా ఉండొచ్చన్నారు.

ద్రవ్యోల్బణం పెరగడం ఆర్‌బీఐ రేట్‌కట్‌ పయనానికి బ్రేకులు వేయవచ్చన్నారు. పండుగ సీజన్‌ అయినప్పటికీ ఐఐపీ బాగా తగ్గడం నెగిటివ్‌ సెంటిమెంట్‌ను రాజేస్తుందని వినోద్‌ చెప్పారు. ఈ నెలాఖరుకు వచ్చే జీడీపీ గణాంకాలు మార్కెట్‌ తదుపరి స్థితిని నిర్ధారిస్తాయన్నారు. క్యు2 జీడీపీ 4.2- 4.7 శాతం మధ్య ఉండొచ్చని ఎక్కువమంది ఎకనమిస్టులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ మాత్రం 6 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. క్యు2లో చాలా కంపెనీలు మంచి ఫలితాలే నమోదు చేశాయని, ఇందుకు పన్ను తగ్గింపులు దోహదం చేశాయని వినోద్‌ వివరించారు. టెలికం రంగం మినహా అన్ని రంగాల్లో పురోగతి కనిపించిందన్నారు. దీంతో పలు చిన్న స్టాకుల రేటింగ్‌ల అప్‌గ్రేడ్‌ కనిపించిందని చెప్పారు. ప్రస్తుతానికి ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉన్నందున చమురు, సహజవాయువు రంగంపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. You may be interested

నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 16th November 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ నష్టంతో ముగిసింది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ ముగింపు 11942.60తో పోలిస్తే 16.60 పాయింట్లు నష్టంతో 11,926.00 వద్ద స్థిరపడింది. ఇక ఈవారంలో మార్కెట్‌ నాలుగు రోజులు మాత్రమే పనిచేసింది. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావితం చేసే అంశాలేమి లేకపోవడం, దేశీయంగా సెప్టెంబర్‌ మాసపు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలతో పాటు అక్టోబర్‌ ఎగుమతులు క్షీణించడంతో ఈ వారం ఆద్యంతం సూచీలు పరిమితి శ్రేణిలో కదలాడాయి. వారం

మార్కెట్లు వాస్తవాన్ని మరిచి పెరుగుతున్నాయి: సామ్కో

Saturday 16th November 2019

‘మార్కెట్‌ సెంటిమెంట్‌కు, దేశ స్థూల ఆర్థిక డేటాకు మధ్య వ్యత్యాసం అధికంగా ఉండడంతో, స్టాక్‌మార్కెట్లు దీర్ఘకాల దిద్దుబాటు దశను ఎదుర్కొనే అవకాశం ఉంది’ అని సామ్కో సెక్యురిటీస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జిమిత్‌మోదీ వ్యాఖ్యానించారు. మిగిలిన ముఖ్యంశాలు ఆయన మాటల్లో..  కార్పొరేట్‌ ఫలితాలు బాగుండడం, అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్లు‍ తగ్గుముఖం పడుతుండడంతో, గత కొన్ని వారాల నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్లను పాజిటివ్‌ సెంటిమెంట్‌ నడుపుతోంది. పాజిటివ్‌ సెంటిమెంట్‌ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లు

Most from this category