News


ఈ రికార్డులే కాదు... ప్రీబడ్జెట్‌ర్యాలీ కూడా!

Saturday 21st December 2019
Markets_main1576904482.png-30349

మార్కెట్‌ పరుగులు కొనసాగుతాయి
నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లు ఈవారం రికార్డు స్థాయిలను తాకి, రికార్డు స్థాయిల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో సూచీల్లో పరుగు జనవరిలో కూడా కొనసాగుతుందని, బడ్జెట్‌పై ఆశలు సూచీలను పరుగు పెట్టిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. మధ్యలో కొంత కన్సాలిడేషన్లున్నా మార్కెట్‌ ముందుకే సాగుతుందన్నారు. మార్కెట్లో అధిక ప్రీమియం వాల్యూషన్లున్నా, విదేశీ నిధుల ప్రవాహం కారణంగా వాల్యూషన్లను పట్టించుకోకుండా అప్‌మూవ్‌ ఉంటుందన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో మరిన్ని సంస్కరణలు తీసుకువస్తుందన్న నమ్మకాలు పాజిటివ్‌ సెంటిమెంట్‌ను పెంచుతాయని అంచనా వేశారు. అయితే ప్రధాన సూచీలకు, విస్తృత మార్కెట్‌ ప్రదర్శనకు మధ్య అంతరం చాలా ఉంది. ప్రధాన సూచీలు ఆల్‌టైమ్‌ హైల్లో ఉన్నా, విస్తృత మార్కెట్లో ఈ జోరు కనిపించడం లేదు. బీఎస్‌ఈ500లో దాదాపు 50 శాతం షేర్లు నెగిటివ్‌గా ఉన్నాయి. కానీ సాంటా ర్యాలీ నుంచి ప్రీబడ్జెట్‌ ర్యాలీలోకి సూచీలు మారుతున్నందున సూచీలు మరో ఆల్‌టైమ్‌ హైలను చూసేవరకు ఆగకపోవచ్చని, నిఫ్టీ త్వరలో 13వేల పాయింట్లను తాకవచ్చని ట్రేడింగ్‌ బెల్స్‌ సీఈఓ అమిత్‌ గుప్తా చెప్పారు. స్వల్పకాలానికి 12350- 12500 పాయింట్లు నిరోధంగా, 12050- 12150 పాయింట్లు మద్దతుగా వ్యవహరిస్తాయన్నారు. టెక్నికల్‌గా చూస్తే 12150పైన నిఫ్టీ కొనసాగినంతవరకు 12400 పాయింట్లను చేరే ఛాన్సులే ఎక్కువని మోతీలాల్‌ఓస్వాల్‌ ప్రతినిధి చందన్‌ తపారియ చెప్పారు. ఆప్షన్‌ డేటా సైతం నిఫ్టీ 12100- 12350 జోన్‌లో కదలాడుతుందని సంకేతాలిస్తోందన్నారు. 

ఇటీవల కాలంలో కింద పేర్కొన్న షేర్లు 10- 30 శాతం రాబడినిచ్చాయి...


పై షేర్లలో పరుగులు కొనసాగవచ్చని నిపుణుల అంచనా..You may be interested

1480డాలర్ల వద్ద స్థిరపడిన పసిడి

Saturday 21st December 2019

అమెరికా మూడో త్రైమాసికపు వృద్ధి గణాంకాలు మార్కెట్‌ అంచనాలను అందుకోవడంతో పసిడి ధర శుక్రవారం నష్టాలతో ముగిసింది. అమెరికాలో రాత్రి ఔన్స్‌ పసిడి ధర 3.50డాలర్లు  పతనమై 1,480.90డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా చైనాల మధ్య పాక్షిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు రిస్క్‌ అసెట్స్‌లైన  ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గచూపుతుండంతో పసిడికి డిమాండ్‌ తగ్గుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు

మహీంద్రా మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు

Saturday 21st December 2019

చైర్మన్‌గా తప్పుకుంటున్న ఆనంద్‌ మహీంద్రా ఇకపై నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగింపు ఎండీ, సీఈవోగా పవన్‌ కుమార్‌ గోయెంకా 2020 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి 2021 తర్వాత సీఈవో, ఎండీగా అనీష్‌ షా న్యూఢిల్లీ: వ్యవసాయోత్పత్తుల నుంచి ఐటీ దాకా వివిధ రంగాల్లో విస్తరించిన మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) టాప్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హోదా నుంచి ఆనంద్ మహీంద్రా (64) తప్పుకోనున్నారు. 2020 ఏప్రిల్‌ 1 తర్వాత నుంచి నాన్‌–ఎగ్జిక్యూటివ్‌

Most from this category