News


ఇన్‌ఫ్రాలో మంచి అవకాశాలు

Friday 27th December 2019
Markets_main1577387423.png-30460

గత ఏడాది కాలంలో మౌలిక రంగానికి చెందిన చాలా స్టాక్స్‌ గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. 2024 నాటికి మౌలిక సదుపాయాల కోసం రూ.100 లక్షల కోట్లు వెచ్చించాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. దీంతో మౌలిక రంగం 2020లో పెట్టుబడుల పరంగా మంచి అవకాశాలనిస్తుందని బ్రోకరేజీ, ఫైనాన్షియల్‌ సేవల సంస్థ ప్రభుదాస్ లీలాధర్‌ తెలిపింది. ‘‘2019-20 ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో ఆర్డర్ల​రాక పుంజుకుంటుంది. రోడ్లు, ఇరిగేషన్‌, ఫ్యాక్టరీలు, బిల్డింగ్‌, రైల్వేస్‌, మైనింగ్‌ రంగంలో అవార్డులు ఎక్కువగా ఉంటాయి’’ అని ప్రభుదాస్‌ లీలాధర్‌ పేర్కొంది. ఇన్‌ఫ్రా కంపెనీలు పెట్టుబడులకు మంచి అవకాశంగా సూచించింది. ఆర్డర్ల పుస్తకం-అమ్మకాల విలువ రేషియో 3.5 రెట్ల వద్ద ఉందని, దీంతో బలమైన ఆదాయాలు వచ్చే అవకాశాలను తెలియజేస్తోందని పేర్కొంది. ప్రాజెక్టుల నిర్వహణ వేగాన్ని సంతరించుకోవచ్చని, చాలా వరకు కంపెనీలు ఆరోగ్యకరమైన బ్యాలన్స్‌ షీటుతో ఉన్నట్టు తెలిపింది.

 

‘‘నిర్మాణ రంగం కంపెనీల షేర్లు లిక్విడిటీ కొరత, ఆర్డర్ల రాక స్తబ్దుగా ఉండడం కారణంగా గత ఏడాది కాలంలో 40-50 శాతం వరకు దిద్దుబాటుకు గురయ్యాయి. వీటి జెడ్‌ స్కోర్‌ ఐదేళ్ల సగటు పీఈ కంటే తక్కువకు ట్రేడవుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని అయితే వాటి సగటు పీఈ కంటే 2 స్టాండర్డ్‌ డీవియేషన్‌ దిగువనే ట్రేడవుతూ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. దీంతో చాలా స్టాక్స్‌ ర్యాలీకి మంచి అవకాశాలను ఆఫర్‌ చేస్తున్నాయి.’’ అని ప్రభుదాస్‌ లీలాధర్‌ తెలియజేసింది. తక్కువ రుణ భారం కలిగిన కంపెనీలు, మంచి కార్పొరేట్‌ గవర్నెన్స్‌, వర్కింగ్‌ క్యాపిటల్‌ సైకిల్‌ తక్కువగా ఉన్నవి, రెండు మూడేళ్ల పాటు ఆదాయాలకు సరిపడా ఆర్డర్లు కలిగి ఉన్న కంపెనీలకు ఈ సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది. ఇన్‌ఫ్రా రంగంలో 10 కంపెనీలకు బై రేటింగ్‌, ఒక స్టాక్‌కు అక్యుములేట్‌ రేటింగ్‌ ఇచ్చింది. 

 

బై రేటింగ్‌ ఇచ్చిన వాటిల్లో కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, హెచ్‌జీ ఇన్‌ఫ్రా, పీఎన్‌సీ ఇన్‌ఫ్రా టాప్‌ పిక్స్‌గా ఉన్నాయి. అశోక బిల్డ్‌కాన్‌, కెపాసిట్‌ ఇన్‌ఫ్రా, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఐటీడీ సిమెంటేషన్‌, జే కుమార్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌, ఎన్‌సీసీ, సద్బావ్‌ ఇంజనీరింగ్‌ కొనుగోలు జాబితాలో ఉన్నాయి. అహ్లువాలియా కాంట్రాక్ట్స్‌కు అక్యుములేట్‌ రేటింగ్‌ ఇచ్చింది. వీటిల్లో అశోక బిల్డ్‌కాన్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, ఐటీడీ సిమెంటేషన్‌, సద్బావ్‌ ఇంజనీరింగ్‌ స్టాక్స్‌ వాటి సగటు పీఈ స్థాయికి చాలా తక్కువలో ట్రేడ్‌ అవుతున్నాయని ప్రభుదాస్‌ లీలాధర్‌ తెలిపింది. రోడ్లు, రైల్వే, బిల్డింగ్స్‌, అర్బన్‌ ఇన్‌ఫ్రా, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ విభాగాల్లో మంచి వృద్ధి అవకాశాలున్నట్టు పేర్కొంది. 



You may be interested

లాభాల ఓపెనింగ్‌కు ఛాన్స్‌?!

Friday 27th December 2019

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయిం‍ట్లు ప్లస్‌  గురువారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్‌ దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో(గ్యాపప్‌) ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 12,234 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. క్రిస్మస్‌ సెలవుల తదుపరి గురువారం​ప్రారంభమైన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మరోసారి సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. కాగా.. క్రితం

ఐదేళ్లలో లాభాలు పదింతలు

Friday 27th December 2019

వేగవంతమైన వృద్ధిని నమోదు చేసే కంపెనీల షేర్లకు మంచి రీరేటింగ్‌.. కాస్త ముందుగా లేదంటే కాస్త వెనుకనో ఎ‍ప్పటికైనా జరగాల్సిందే. అప్పటి వరకు ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు ఓపిక వహించాలి. అప్పుడే లాభాలకు అవకాశం ఉంటుంది. మనీ కంట్రోల్‌ సంస్థ గత ఐదేళ్లలో లాభాలను పదిరెట్లు పెంచుకున్న కంపెనీలతో ఓ జాబితాను రూపొందించింది. వీటిల్లో ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఒకటి. ఇది ఐరన్‌ అండ్‌ స్టీల్‌ రంగ

Most from this category