News


లాభాల ప్రారంభం

Monday 3rd June 2019
Markets_main1559533249.png-26051

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలకు తోడు గత శుక్రవారం వెల్లడైన జీడీపీ గణాంకాలు నిరుత్సాహపర్చినప్పటికీ సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 92 పాయింట్ల లాభంతో 39,806 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 31 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,954 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత శుక్రవారం పతనంకావడం, ఈ వారం ఆర్‌బీఐ సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు, తాజాగా రూపాయి జోరుగా పెరగడం వంటి సానుకూలాంశాలు భారత్‌ మార్కెట్‌కు ఊతమిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 3rd June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  దిలీప్‌ బిల్డ్‌కాన్‌:- మహారాష్ట్రలోని వివిధ రహదారలు నిర్మాణం కొరకు ఎన్‌హెచ్‌ఏఐతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసింది.  ఎన్‌టీపీసీ:- 800 మెగావాట్ల సామర్థ్యం గల గదర్వా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లో వ్యాపార కార్యకలాపాల్ని ప్రారంభించింది.  టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌:- భూషణ్‌ ఎనర్జీలో నిర్ణయాత్మక వాటాను దక్కించేందకు తన మాతృ సంస్థ సమర్పించిన దివాళా సృ‍్మతి ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. వైభవ్‌ గ్లోబల్‌:- కంపెనీ బోర్డు

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు అప్‌

Monday 3rd June 2019

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నప్పటికీ,  భారత్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40 గంటలకు 50  పాయింట్ల లాభంతో 11,966 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ జూన్‌ ఫ్యూచర్‌ 11,916  పాయింట్ల వద్ద ముగిసింది.  తాజాగా ఆసియా మార్కెట్లలో  జపాన్‌ నికాయ్‌ 1 శాతంపైగా క్షీణించగా, సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌  చైనా షాంఘై,

Most from this category