News


లాభాల ప్రారంభం

Thursday 30th May 2019
Markets_main1559188088.png-25989

 ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నా, గురువారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 90 పాయింట్ల లాభంతో 39,595 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11, 885 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బజాజ్‌ ఆటో, పవర్‌గ్రిడ్‌, బీపీసీఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌లు 1-2 శాతం జంప్‌చేయగా, హిందాల్కో, మహింద్రా, వేదాంత, గ్రాసిమ్‌లు 1 శాతం నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. 

ట్రేడ్‌వార్‌ ఎఫెక్ట్‌....ఆసియా డౌన్‌

అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ ఉధృతరూపం దాల్చడంతో తాజాగా ఆసియా మార్కెట్లలో జపాన్‌ నికాయ్‌ 1 శాతం వరకూ పడిపోయింది. , సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌,  చైనా షాంఘై, కొరియా కోస్పి ఇండెక్స్‌లు  0.5-1 శాతం మధ్య నష్టాల్లో ట్రేడవుతున్నాయి. తైవాన్‌ వెయిటెడ్‌ మాత్రం అరశాతం వరకూ పెరిగింది. వినియోగ పరిశ్రమల్లో వినియోగించే రేర్‌ ఎర్త్స్‌ ఎగుమతుల్ని అమెరికాకు నిలిపివేసే యోచనను చైనా చేస్తున్నదన్న ఆందోళనతో గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 1 శాతం వరకూ పతనమై, రెండు నెలల కనిష్టస్థాయి వద్ద ముగిసాయి. 



You may be interested

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 30th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  భార‌తీ ఎయిర్‌టెల్‌:- సింగ‌పూర్ టెలికాం దిగ్గజ కంపెనీ సైన్‌టెల్ కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా 17 కోట్ల ఈక్విటీ షేర్లను స‌బ్ స్క్రైబ్ చేసుకుంది. ఈ ఈ సబ్‌స్క్రిప్షన్‌ విలువ రూ.3,740 కోట్లుగా ఉంది. మ‌న్ ప‌సంద్‌:- జీఎస్టీ చెల్లింపు విష‌యంలో మోసానికి పాల్పడిన కంపెనీ అధికారులు అరెస్ట్ అయ్యారు. నిందితుల‌కు కోర్టు బెయిల్ నిరాక‌రించింది.  చోళ‌మండ‌లం ఇన్వెస్ట్‌మెంట్‌:- యూఎస్ డాల‌ర్ల బాండ్ల  రూపంలో

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Thursday 30th May 2019

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నప్పటికీ,  భారత్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40 గంటలకు 50  పాయింట్ల లాభంతో 11,966 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ జూన్‌ ఫ్యూచర్‌ 11,916  పాయింట్ల వద్ద ముగిసింది.  తాజాగా ఆసియా మార్కెట్లలో  జపాన్‌ నికాయ్‌ 1 శాతంపైగా క్షీణించగా, సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌  చైనా షాంఘై,

Most from this category