పాజిటివ్ ప్రారంభం
By Sakshi

గత ఐదు ట్రేడింగ్ సెషన్లుగా పెద్ద ర్యాలీ జరిపిన భారత్ స్టాక్ సూచీలు...నవంబర్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజైన శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 40,195 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9 పాయింట్ల పెరుగుదలతో 11,886 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందంపై క్రితం రోజు చైనా అనుమానాలు వ్యక్తపర్చడంతో గత రాత్రి అమెరికా స్టాక్ సూచీలు గరిష్టస్థాయి నుంచి క్షీణించాయి. అయితే తాజాగా ఆసియా సూచీల్లో జపాన్ నికాయ్ సూచి 0.7 శాతం క్షీణించగా, మిగిలిన ప్రధాన దేశాల సూచీలు స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి.
You may be interested
ఆ టెల్కోలకు ప్యాకేజీలు అక్కర్లేదు
Friday 1st November 2019అవి బాకీలు కట్టగలిగే స్థితిలోనే ఉన్నాయి టెలికం మంత్రికి జియో లేఖ న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ స్థాయిలో లైసెన్సు ఫీజులు బాకీలు కట్టాల్సి రానున్న పాత తరం టెల్కోలు .. ప్రభుత్వాన్ని బెయిలవుట్ ప్యాకేజీ కోరుతుండటంపై రిలయన్స్ జియో మండిపడింది. ఆ రెండు సంస్థలు (భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా) ఆర్థికంగా పటిష్టంగానే ఉన్నాయని, ప్రజల సొమ్ముతో వాటికి ప్యాకేజీలేమీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా మూడు
చెరి 50 శాతం వాటాలు
Friday 1st November 2019పీఎస్ఏ-ఫియట్ విలీన ప్రణాళిక వెల్లడి ప్యారిస్: ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం పీఎస్ఏ, అమెరికా-ఇటాలియన్ వాహన తయారీ సంస్థ ఫియట్ క్రిస్లర్ (ఎఫ్సీఏ) సంస్థలు తమ విలీన ప్రతిపాదనను ఆవిష్కరించాయి. విలీనానంతరం నెదర్లాండ్స్ కేంద్రంగా మాతృసంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇందులో రెండు సంస్థలకు చెరి 50 శాతం వాటాలు ఉంటాయి. విలీన కంపెనీకి మొత్తం 170 బిలియన్ యూరోల అమ్మకాలు, 11 బిలియన్ యూరోల నిర్వహణ లాభాలు